దేశంలో గత 24 గంటల్లో 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు ఎంతంటే?

132 Fresh Corona Positive Cases 147 Recoveries Reported in India in the Last 24 Hours,132 Fresh Corona Positive Cases,147 Corona Recoveries,Reported in India in the Last 24 Hours,Mango News,Mango News Telugu,Covid Last 24 Hours, 294 People Tested Positive,Coronavirus In India,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జనవరి 26, గురువారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,82,338 కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పాండిచ్చేరి వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది. మరోవైపు కరోనా వలన మరో మరణం (కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,738కి పెరిగింది.

అలాగే మరో 147 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,49,694 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 1,906 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 1,69,392 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.08 శాతంగా నమోదైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =