దేశంలో గత 24 గంటల్లో 157 కరోనా కేసులు నమోదు, రోజువారీ పాజీటివిటీ రేటు 0.32 శాతం

157 Fresh Covid-19 Positive Cases 163 Recoveries Reported in India in the Last 24 Hours,5 Covid Deaths,Covid Last 24 Hours, 157 People Tested Positive,Coronavirus In India,Mango News,Mango News Telugu,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కలిపి 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 27, మంగళవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,77,459 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరోక మరణం (కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,696కి పెరిగింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 49,464 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.32 శాతంగా నమోదైంది.

అలాగే మరో 163 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,43,342 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 3,421 (0.01%) మంది చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 10 =