కరోనా వేళ చైనా కీలక నిర్ణయం.. జనవరి నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్‌ నిబంధన ఎత్తివేత

China To Drop The Covid-19 Quarantine Regulations For Incoming Travelers From Jan 8th,China To Drop Covid-19 Quarantine Regulations,Quarantine Regulations For Travelers,Quarantine Regulations China,Mango News,Mango News Telugu,BF7 Variant Cases,BF7 Variant Latest News and Updates,Omicron BF7 Symptoms,BF7 Variant Symptoms,BF7 Variant Severity,Omicron BF7 In India,BF7 Covid Variant,Ba 5 1 7 Variant,Omicron New Variant,Omicron New Variant In India,Omicron Bf.7 Symptoms,Bf.7 Variant Severity,Omicron Bf.7 In India,Ba 5.1 7 Variant,Bf.7 Variant,BF7 Variant In India,Bf.7 Variant Covid,Bf.7 Variant Cdc,Bf.7 Variant Canada,Bf.7 Variant Uk,Bf.7 Variant Belgium,Bf.7 Variant Mutations,Covid BF7 Variant,Omicron BF7 Variant,Covid BF7 Variant Symptoms

కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా అత్యంత కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న చైనా.. ఆంక్షలు సడలించిన క్రమంలో ప్రస్తుతం పరిస్థితులు అదుపు తప్పినట్లు వార్తలు ఆవస్తున్నాయి. అక్కడ ఒక్క రోజులోనే లక్షల సంఖ్యలో కోవిడ్-19 కేసులు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆశ్చర్యకరంగా చైనా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్‌ తప్పనిసరి అనే నిబంధనను తొలగించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్‌లోకి ప్రవేశించాల్సిన అవసరం లేదని చైనా అధికారిక వర్గాలు సోమవారం ప్రకటించాయి.

కోవిడ్-19ని నియంత్రించేందుకు చైనా తీసుకున్న చర్యలను సడలించడానికి జాతీయ ఆరోగ్య కమిషన్ తాజా ప్రయత్నంగా ఈ ప్రకటన చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. అయితే చైనా లోకి ప్రవేశించడానికి 48 గంటల ముందు కోవిడ్-19 పరీక్షలో నెగిటివ్ ఫలితం కలిగి ఉండాలి, అలాగే వారు విమానంలో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి అని స్పష్టం చేసింది. కాగా ఇప్పటివరకూ ఉన్న నిబంధన ప్రకారం.. చైనాలోకి అడుగిడిన విదేశీ ప్రయాణీకులందరూ ఐదు రోజులు హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండాలి, అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మరో మూడు రోజులు ఐసొలేట్ అయి ఉండాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − thirteen =