దేశంలో మరో 226 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 98.80 శాతం

226 Covid-19 Positive Cases Reported in India in Last 24 Hours Recovery Rate Stands at 98.80, India Recovery Rate Stands at 98.80, 226 Covid-19 Positive Cases Reported in India in Last 24 Hours, 226 Covid-19 Positive Cases, India New Covid-19 Positive Cases, Covid-19 Positive Cases, India Covid-19, India Covid-19 News, India Covid-19 Latest News, India Covid-19 Latest News And Updates, India Covid-19 Live Updates, 226 New Covid-19 Positive Cases, 4529 Covid-19 Active Cases, Covid-19 Positive Cases On December 4th, Mango News, Mango News Telugu

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 250 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 226 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 5,సోమవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,73,618కు చేరుకుంది. అలాగే కొత్తగా ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,630గా ఉంది. ఇక దేశంలో గత 24 గంటల్లో 1,10,839 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.20 శాతంగా నమోదైంది.

అలాగే మరో 319 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,38,554 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 4,434 (0.01%) మంది చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసులు కొంత ఎక్కువుగా నమోదయ్యాయి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =