నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్, ప్రధాని మోదీ నేతృత్వంలో జీ-20 సమ్మిట్ పై అఖిలపక్ష భేటీకి హాజరు

AP CM YS Jagan to Visit Delhi Today to Attend All Party-meeting over G20 Summit, AP CM YS Jagan to Attend All Party-meeting over G20 Summit, AP CM YS Jagan to Visit Delhi Today, AP CM YS Jagan Delhi Visit, AP CM YS Jagan Delhi Tour, G-20 Summit Chaired by PM Modi in Delhi, AP CM YS Jagan Mohan Reddy, All Party Meeting, G-20 Summit, G-20 nations meeting, PM Modi, G-20 Summit News, G-20 Summit Latest News, G-20 Summit Live Updates, Mango News, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం (డిసెంబర్ 5, సోమవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించేందుకు ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ అఖిలపక్ష సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 5, సోమవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జీ-20 సమ్మిట్ పై జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లి ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. సాయంత్రం 5-7 గంటల వరకు జీ-20 సమ్మిట్ పై అఖిలపక్ష సమావేశంలో సీఎం పాల్గొంటారు. అనంతరం రాత్రి 7.55 గంటలకు సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ నుంచి బయలుదేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. అలాగే దేశంలోని పలు పార్టీల అధినేతలు కూడా కేంద్రం ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి హాజరుకానున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here