దేశంలో మరో 279 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు ఎంతంటే?

279 Corona Positive Cases 5 Deaths Reported in India in Last 24 Hours,5 Covid Deaths,Covid Last 24 Hours, 279 People Tested Positive,Coronavirus In India,Mango News,Mango News Telugu,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 300 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 279 పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో నవంబర్ 30, బుధవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,72,347కు, మరణాల సంఖ్య 5,30,620కి పెరిగింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 2,95,319 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.09 శాతంగా నమోదైంది.

అలాగే మరో 401 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,36,872 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 4,855 (0.01%) మంది చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసులు కొంత ఎక్కువుగా నమోదు అవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + nine =