దేశంలో కొత్తగా 3,615 కరోనా పాజిటివ్ కేసులు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?

3615 Fresh Covid-19 Positive Cases 22 Deaths Reported in India in Last 24 Hours, 3615 New Corona Cases Registered In India , 22 COVID Deaths Have Been Recorded, India Records 3615 New Covid Cases, 22 Covid Deaths September 28th, Mango News, Mango News Telugu, India Logs 3615 Covid Positive Cases, 3615 New COVID19 Cases In Telangana, COVID19 Cases In India, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, India COVID News

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. కొత్తగా 4 వేలలోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,615 పాజిటివ్ కేసులు, 22 మరణాలు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో సెప్టెంబర్ 28, బుధవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,45,79,088 కు, మరణాల సంఖ్య 5,28,584 కి పెరిగిందని తెలిపారు.

అలాగే గత 24 గంటల వ్యవధిలో 4,972 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,40,09,525 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.72 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 40,979 (0.09%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 3,23,293 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 89.44 (89,44,16,853) కోట్లు దాటింది. రోజువారీ పాజీటివిటీ రేటు 1.12 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 1.55 శాతంగా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − seven =