నంద్యాలలో ‘రామ్‌కో’ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

CM YS Jagan Mohan Reddy Inaugurates Ramco Greenfield Cement Factory in Nandyal Today, CM YS Jagan Inaugurated Ramco Cement Factory in Nandyala, Ramco Cement Factory, Ramco Cement Factory in Nandyala, Ramco Cement Factory Opened By YS Jagan, Ramco Cement Factory Nandyala, Mango News, Mango News Telugu, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, AP CM YS Jagan Latest News And Updates, Nandyala Ramco Cement Factory, Nandyala Ramco Cement Factory Inaguration, Nandyala Ramco Cement Factory News And Live Updates, YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో రామ్‌కో గ్రీన్‌ఫీల్డ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. కాగా సీఎం వైఎస్‌ జగన్‌ కొలిమిగుండ్లలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ ఫ్యాక్టరీ ఏడాదికి 2 మిలియన్ల సిమెంట్‌ను తయారు చేయగలదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. జిల్లాలోని కల్వటాల వద్ద సుమారు రూ. 1790 కోట్లతో రామ్‌కో ఫ్యాక్టరీ నెలకొల్పారు. ఏడాదికి 2 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్ధ్యం లక్ష్యంగా దీనిని నిర్మించారు. ఇక ఇప్పటికే నంద్యాల జిల్లాలో జయజ్యోతి, జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. జిల్లాలో సిమెంట్ ఉత్పత్తికి తగ్గ ముడి ఖనిజం, నీరు మరియు రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉండటంతో జిల్లా సిమెంట్ ఫ్యాక్టరీలకు ప్రధాన కేంద్రంగా మారుతోందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 6 గ్రామాల పరిధిలో సుమారు 5వేల ఎకరాలు కేటాయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =