15 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి, విడాకులు తీసుకుంటున్న అమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావు

Aamir Khan And His Wife Kiran Rao, Aamir Khan And His Wife Kiran Rao Announce Divorce, Aamir Khan and Kiran Rao announce separation, Aamir Khan and Kiran Rao Divorce, Aamir Khan Wife Kiran Rao, Aamir Khan Wife Kiran Rao Announce Divorce, Actor Aamir Khan and wife Kiran Rao announce divorce, Actor Aamir Khan Wife Kiran Rao Announce Divorce, Bollywood Star Aamir Khan, Bollywood Star Aamir Khan And His Wife Kiran Rao Announce Divorce Officially, Mango News

బాలీవుడ్‌ స్టార్ హీరో, మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావుల జంట విడిపోతున్నారు. 15 ఏళ్ల తమ వివాహబంధానికి స్వస్తి చెబుతూ, విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావులు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. “ఈ 15 అందమైన సంవత్సరాల్లో మేము జీవితకాల అనుభవాలు, ఆనందం మరియు నవ్వులను పంచుకున్నాము, మరియు మా సంబంధం నమ్మకం, గౌరవం మరియు ప్రేమతో మాత్రమే పెరిగింది. ఇప్పుడు మా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాము. ఇకపై భార్యాభర్తలుగా కాకుండా, సహ తల్లిదండ్రులుగా మరియు ఒకరికొకరు కుటుంబంగా ఉండాలనుకుంటున్నాం. మేము కొంతకాలం నుంచే విడిపోవడానికి సిద్ధమవడం ప్రారంభించాం. ఇప్పుడు విడిగా జీవించడం, నూతన ప్రయాణానికి సరైన సమయంగా భావిస్తున్నాం. మా కొడుకు ఆజాద్ పట్ల అంకితభావంతో ఉన్నాము, పెంచడం సహా బాధ్యతలను మేము ఉమ్మడిగా పంచుకుంటాం” అని కిరణ్ రావు, అమీర్ ఖాన్ తెలిపారు

“సినిమాలు, పానీ ఫౌండేషన్ మరియు ఇతర ప్రాజెక్టులపై కలిసి పని చేస్తూనే ఉంటాము. మా సంబంధంలో ఈ పరిణామం గురించి మా కుటుంబాలు మరియు స్నేహితుల నిరంతర మద్దతు, అవగాహనకు పెద్ద ధన్యవాదాలు. మా శ్రేయోభిలాషుల నుంచి శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాల కోసం మేము అభ్యర్థిస్తున్నాము మరియు మీరు ఈ విడాకులను ముగింపుగా కాకుండా, కొత్త ప్రయాణం ప్రారంభంగా చూస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు” అంటూ కిరణ్ రావు, అమీర్ ఖాన్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − one =