అగ్నిపథ్ పథకం: అగ్నివీరులకు కేంద్ర రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్స్

Agnipath Scheme Rajnath Singh Approves Proposal to Reserve 10% Vacancies for Agniveers in Defence Ministry, Defence Minister Rajnath Singh Approves Proposal to Reserve 10% Vacancies for Agniveers in Defence Ministry, Rajnath Singh Approves Proposal to Reserve 10% Vacancies for Agniveers in Defence Ministry, 10% Vacancies for Agniveers in Defence Ministry, Agniveers in Defence Ministry, 10% Vacancies for Agniveers, Defence Minister of India, Rajnath Singh Defence Minister of India, Defence Minister Rajnath Singh, Rajnath Singh, Agnipath Protests Live Updates, Agnipath Issue, Agnipath Protests, Agnipath protests in Telangana, Agnipath Scheme, Agnipath Scheme Updates, Agnipath, Agnipath Protests Highlights, #AgnipathScheme, #AgnipathRecruitmentScheme, #AgnipathSchemeProtest, #Agnipath, Agnipath Army Recruitment Scheme News, Agnipath Army Recruitment Scheme Latest News, Agnipath Army Recruitment Scheme Latest Updates, Agnipath Army Recruitment Scheme Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలో త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై గత రెండ్రోజులుగా పలు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖలోని 10% ఉద్యోగ ఖాళీలను అగ్నివీరుల కోసం అవసరమైన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా రిజర్వ్ చేసే ప్రతిపాదనను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించారు. ఈ మేరకు రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులతో పాటుగా అన్ని 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లలో (హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్, మిశ్రా ధాతు నిగమ్ (మిధాని) లిమిటెడ్, ఆర్మర్డ్ వెహికల్స్, అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్, మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్, యంత్ర ఇండియా లిమిటెడ్, గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్, ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ మరియు ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్) 10% రిజర్వేషన్ అమలు చేయబడుతుందని ప్రకటించారు. ఈ రిజర్వేషన్ మాజీ సైనికులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు అదనంగా ఉంటుందని తెలిపారు.

ఈ నిబంధనలను అమలు చేయడానికి సంబంధిత రిక్రూట్‌మెంట్ నియమాలకు అవసరమైన సవరణలు చేపట్టబడతాయని, అలాగే డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లలో తమ సంబంధిత రిక్రూట్‌మెంట్ నియమాలకు ఇలాంటి సవరణలు చేయాలని సూచించబడతాయని తెలిపారు. అలాగే పై పోస్టులకు అగ్నివీరులకు రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించడానికి అవసరమైన వయస్సు సడలింపు నిబంధన కూడా చేయబడుతుందని కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది.

ముందుగా అగ్నివీరులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 10% రిజర్వేషన్లు ప్రకటించింది. సీఏఫీఎఫ్‌లు మరియు అస్సాం రైఫిల్స్‌లో రిక్రూట్‌మెంట్ కోసం అగ్ని వీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే సీఏఫీఎఫ్‌లు మరియు అస్సాం రైఫిల్స్‌లో రిక్రూట్‌మెంట్ కోసం అగ్నివీరులకు సూచించిన గరిష్ట ప్రవేశ వయోపరిమితిలో 3 సంవత్సరాల సడలింపు ఇవ్వనున్నారు. దీంతో అగ్నిపథ్ పథకం మొదటి బ్యాచ్ కోసం ఈ వయోపరిమితి సడలింపు 5 సంవత్సరాలు ఉంటుందని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + one =