అందగత్తెలకు కేరాఫ్ ఆ వ్యాలీ

All The Beautiful Women In The World Are In That Valley,All The Beautiful Women In The World,Beautiful Women Are In That Valley,Mango News,Mango News Telugu,Valley Of The Beautiful Women,Hunza Valley, Beautiful Women, Pakistan, Hunza Valley In Pakistan,Beautiful Women Latest News,Beautiful Women Latest Updates,Beautiful Women Live News,Hunza Valley Latest News,Hunza Valley Latest Updates

అందం ఎక్కడ ఉంటే అందరి చూపూ అక్కడే ఉంటుంది. ఎంతటివారయినా తమకు తెలీకుండానే తమ చూపులను ఆ అందానికి దాసోహం చేసేస్తారు. అందుకే అందం గురించి.. అందమైన అమ్మాయిల గురించి ప్రపంచం మొత్తం నిత్యం మాట్లాడుకుంటూనే ఉంటుంది. అలా ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారనే టాపిక్‌ వచ్చినప్పుడు మాత్రం.. పాకిస్తాన్‌లోని ఒక ప్రదేశం గురించి తప్పకుండా చర్చిస్తారు.

ఎందుకంటే అక్కడి మహిళలు 60, 70 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా, ఎంతో అందంగా ఆకట్టుకునేలా కనిపిస్తుంటారట. అందుకే ఇక్కడి అమ్మాయిలను అత్యంత అందగత్తెలుగా ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది. దీనికి తోడు ఆ మహిళలు ఆరోగ్యకరంగా ఉండటంతో.. ఇక్కడి మహిళలు 60 ఏళ్లు దాటిన తరువాత కూడా.. తల్లులయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటూ వైద్య శాస్త్రానికే సవాల్ విసురుతూ ఉంటారు.

పాకిస్తాన్‌లో ఉన్న ఈ ప్రాంతం పేరు హుంజా వ్యాలీ. హుంజా వ్యాలీలో నివసించే యువతులు, మహిళలు ఎంతో అందగత్తెలుగా పేరొందారు. అక్కడి మహిళలు చిన్నప్పటి నుంచీ కూడా క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో ఉంటారు. దీని వల్లే అక్కడి మహిళలు 100 ఏళ్లకు పైగా ఆరోగ్యంగా జీవిస్తుంటారు.

మహిళలే కాదు ఇక్కడ ప్రజలు కూడా.. చాలా అరుదుగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఇక్కడ ప్రవహించే నదిలో ఆరోగ్యాన్ని పెంపొందించే ఖనిజాలు ఉండటమే కారణమని అక్కడి వారు చెబుతుంటారు.హుంజా వ్యాలీలో ఉండేవారంతా.. మధ్యాహ్నం ఒకసారి, రాత్రిపూట ఒకసారి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటారు. ఇ‍క్కడి ‍ప్రజలు ప్రధాన వృత్తి వ్యవసాయమే. వీరు చేసే వ్యవసాయంలో ఎలాంటి క్రమిసంహారక మందులు, రసాయనాలు కానీ వాడరు.ఇలా వీరు ఎటువంటి రసాయనాలు వాడకుండా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడం కూడా వీరి అందానికి, ఆరోగ్యానికి కూడా కారణమని అంటారు.

అలాగే ప్రపంచంలోని ఆయుర్దాయం ఎక్కువగా ఉండే ప్రదేశాలను.. బ్లూ జోన్‌లు అంటారు.అలా ఈ లిస్టులోకి హుంజా వ్యాలీ కూడా బ్లూ జోన్‌ పరిధిలోకే వస్తుంది. అంతేకాదు ఇక్కడి ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక్కడి మహిళల అందానికి , ఆరోగ్యానికి అక్కడ ఉండే నీళ్లు, దొరికే ఆహారమే కారణంగా చెబుతారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =