జపాన్‌లో కొలిచే హిందూ దేవతలు

Is Japanese Related To Hinduism,Japanese Related Hinduism,Related To Hinduism,Mango News,Mango News Telugu, Many Japanese Buddhist Deities,Are There Similarities Between Hindu And Japanese Gods,Hindu Gods In Japan,Hinduism Influence On Japanese Culture,Hindu Mythology,Hindu Gods In Japan, Japanese Related To Hinduism, Japan, Japanese, Hinduism,Hindu Deities In Japan,Hinduism Latest News,Hinduism Latest Updates,Hinduism Live News

సాంకేతిక అభివృద్ధికి, టెక్నాలజీ వినియోగానికి జపాన్‌‌ను కేరాఫ్‌‌గా చెప్పుకుంటారు. అణుబాంబులు పడినా..ప్రతీఏటా ప్రకృతి ప్రకోపిస్తున్నా.. వేగంగా వాటి నుంచి బయటపడుతూనే.. టెక్నాలజీలో అగ్రదేశాలకు సవాల్‌ విసరడంలో జపాన్‌ ఎప్పుడూ ముందే ఉంటుంది. అయితే అలాంటి హైటెక్‌ జపాన్‌లో కూడా సంప్రదాయాలను పాటిస్తూ.. దేవుళ్లను పూజించడం ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా..జపాన్‌ మతం హిందూ మతానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది.అంతెందుకు అక్కడి దేవుళ్లు కూడా హిందూ దేవుళ్లునే పోలి ఉంటారు.

సంప్రదాయ జపనీస్‌ భాషలో భారతదేశం అంటే ‘టెన్జికు’ అని అర్ధం వచ్చినట్లుగా పిలుస్తుంటారు. అంటే దీనిని స్వర్గం యొక్క భూమి అని అర్థంగా వాళ్లు భావిస్తారు.నిజానికి జపనీస్‌ సంస్కృతి భారతీయ నాగరికతను ఎంతగా అభినందిస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. టెన్జికు అనే పదం, టియాన్జు చైనీస్‌ పదం నుంచి ఉద్భవించింది. చైనాకు వెళ్లి బోధనలను వ్యాప్తి చేసిన శాక్యముని అంటే బుద్ధుడి ద్వారా భారతీయ ఆలోచనలు, తత్వాలు , సంస్కృతులు అలా చైనాకు కూడా వ్యాపించాయి.

జపనీస్‌ సంస్కృతిలో హిందూ సంస్కృతిలాగే దేవుళ్లు, రాక్షసులు కూడా ఉంటారు. హిందూ పురాణాలను పోలిన పురాణాలు అక్కడ కూడా ఉంటాయి. అంతెందుకు జపనీస్‌ పురాణాలను చదివితే అందులో అనేక హిందూ దేవతలు ఉన్నారు. వారిలో ముఖ్యంగా ఆరుగురు దేవుళ్లు కీలకంగా జపనీయులు చెప్పుకుంటారు. జపాన్‌లో కేవలం సరస్వతి దేవికి మాత్రమే అంకితం చేయబడిన వందల ఆలయాలు ఉన్నాయంటే నమ్మకశ్యం కూడా కాదు.అంతేకాదు ప్రతిరోజూ 1,200 కంటే ఎక్కువ దేవాలయాలలో ‘హవన్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

సరస్వతి లేదా బెంజైటెన్సమాను ఏడుగురు అదృష్ట దేవుళ్లలో ఒకరిగా జపనీయులు కొలుస్తారు. అమ్మవారిని జ్ఞానం, అభ్యాసం, వాక్కు,సంగీతానికి దేవతగా భావిస్తారు.

వైశ్రవణ లేదా కుబేరుడు లేదా బిషామోంటెన్‌.. షిచి ఫుకుజిన్‌లో ఒకడు. అతను అదృష్ట యోధుల దేవుడిగానూ అలాగే తప్పు చేసిన వారిని శిక్షించే దేవుడిగా పూజిస్తారు జపనీయులు.

లక్ష్మి లేదా కిచిజోటెన్‌..లక్ష్మీదేవిని పోలి ఉన్న అమ్మవారిని ఆనందం, సంతానోత్పత్తి,అందానికి అధిపతిగా జపనీయులు పూజిస్తారు.

విశ్వకర్మ లేదా బిషుకట్సుమటెన్‌‌ను.. హిందూ వాస్తు శిల్పులు విశ్వకర్మను జపనీయులు తమ దైవంగా ఆరాధిస్తారు. జపాన్‌లో ఎన్నో ఏళ్లుగా రాజ గృహాలలో వడ్రంగుల దేవుడిగా విశ్వకర్మను పూజించేవారిని అక్కడి చరిత్రకారులు చెబుతారు.

గణేశుడు లేదా కంగీటెన్‌‌ను జపనీయులు ఆనందం యొక్క దేవుడుగా కొలుస్తారు. అడ్డంకులను తొలగించే దేవుడిగా అంతా ఆరాధిస్తారు. అంతేకాదు గణపతిని భౌతిక శ్రేయస్సు యొక్క వరం కూడా ఇస్తాడని జపనీయులు నమ్ముతారు.

యమరాజ్‌ లేదా యముడు లేదా ఎమ్మాటెన్‌‌ను జపాన్‌లో అత్యంత భయపడే దేవతలలో ఒకడిగా చెబుతారు. ఎమ్మాటెన్‌ను నరకానికి రాజుగా జపనీయులు భావిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 14 =