కరోనా వ్యాక్సిన్ బూస్టర్‌ డోసు వేయించుకున్న యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్

America President Joe Biden Gets Covid-19 Vaccine Booster Shot,Mango News,Mango News Telugu,America,America News,America President,America President Joe Biden,President Joe Biden,Joe Biden,Joe Biden News,Joe Biden Latest News,Joe Biden Live,Joe Biden Live Updates,Joe Biden Latest Updates,Joe Biden Speech,Joe Biden Gets Covid-19 Vaccine Booster Shot,Covid-19 Vaccine,Vaccine,Covid-19,Corona Vaccine,President Joe Biden Gets Covid-19 Vaccine Booster Shot,US President Joe Biden Gets COVID-19 Vaccine Booster Shot,US President Joe Biden,COVID-19 Vaccine Booster Shot,US President Joe Biden,Covid-19 News,US Booster Shots,US COVID-19,US President Joe Biden Receives Booster Shot Of Covid-19 Vaccine,Us President Biden Gets Covid-19 Vaccine,Joe Biden Gets Covid-19 Booster Shot,Joe Biden Covid-19 Booster Shot,COVID-19 Booster Shot,Biden Receives His Covid-19 Booster Shot,#JoeBiden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం నాడు కోవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్‌ డోసు తీసుకున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి మరింత రక్షణ కోసం రెండు డోసులు తీసుకున్న అనంతరం 65 ఏళ్లు పైబడిన వారు మూడోదైనా బూస్టర్ డోసు కూడా తీసుకునేలా అమెరికా సీడీసీ, ఎఫ్‌డీఏ ఆరోగ్య మార్గదర్శకాలకు ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు జో బైడెన్ బూస్టర్‌ డోసు తీసుకున్నారు. అనంతరం జో బైడెన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, కోవిడ్-19 బూస్టర్ షాట్‌లు ఎక్కువ ప్రమాదం ఉన్నవారికి కోవిడ్-19 నుండి మరింత రక్షణను అందిస్తాయి. అందుకే ఈరోజు నేను వ్యాక్సిన్ బూస్టర్‌ డోసు తీసుకున్నాను. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ తీసుకునేలా ప్రోత్సహించండి” అని పేర్కొన్నారు. అమెరికాలో ప్రస్తుతం కరోనా డెల్టా వేరియంట్ విజృంభణతో కోవిడ్ పాజిటివ్ కేసులు మరింతగా పెరుగుతుండడంతో నిబంధనల ప్రకారం అర్హత ఉండి, అధిక ప్రమాదం ఉన్న వర్గాలకు కోవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్‌ డోసు అందించడంపై అమెరికా ప్రభుత్వం దృష్టి సారించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + fifteen =