అక్టోబర్ 30న బద్వేలు ఉపఎన్నిక, వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దాసరి సుధ ఎంపిక

YSRCP Announced Dasari Sudha as Party Candidate for Badvel By-Election,Mango news,Mango News Telugu,AP,AP News,Andra Pradesh,YSRCP,YSRCP News,YSRCP Latest News,YSRCP Party,Badvel,Badvel By-Election,Badvel By-Election 2021,2021 Badvel By-Election,Badvel By-Election Live,Badvel By-Election Live Updates,AP By-Election,Badvel By-Election Updates,Badvel By-Election News,Badvel By-Election Latest News,Dasari Sudha,Dasari Sudha Live,Dasari Sudha Latest News,Dasari Sudha News,Dasari Sudha as Party Candidate for Badvel By-Election,Dasari Sudha as Party Candidate,Dasari Sudha Badvel By-Election,Badvel Bypolls 2021,YSRCP Confirms Dr Dasari Sudha As Party Candidate,Badvel Bypolls,2021 Badvel Bypolls,Badvel bypoll News,Candidates Announced For Bypoll In Andhra Pradesh,Andhra Pradesh Bypoll,Badvel By-Election Candidate

కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్ 30న ఉపఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణించడంతో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. దీంతో అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుండగా, అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బద్వేలు ఉపఎన్నికకు అధికార వైఎస్సార్సీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధను వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెడ్డి ఎంపిక చేసినట్టు ఏపీ​ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి పోటీలో ఉండబోతున్నారు.

మరోవైపు బద్వేలు ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ పేరును టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల, అభ్యర్థులు ఖరారు కావడంతో ఇరుపార్టీలు బద్వేలు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడంపై దృష్టి సారించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − three =