అమెరికాలో కరోనా: ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 5 లక్షలకుపైగా కరోనా కేసులు

America Coronavirus, America Coronavirus Deaths, America Reports Record Number Of Daily Covid Cases, America Reports Record Number Of Daily Covid Cases More Than 5 Lakh Cases in 24 Hours, Coronavirus Cases, Coronavirus Crisis, Coronavirus Deaths In US, Coronavirus outbreak, Coronavirus Pandemic, Coronavirus Precautions, Coronavirus Symptoms, COVID 19 Deaths, COVID 19 Deaths In US, Mango News, US Coronavirus Deaths, US COVID 19 Deaths, US Reports Highest Number Of Casualties, USA

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలపై ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై కోవిడ్ ప్రభావం ఇంకా అధికంగా ఉంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా మొదటిస్థానంలో ఉండగా, తాజాగా కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో గత కొన్ని రోజులుగా అక్కడ రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో డిసెంబర్ 30, గురువారం నాడు ఒక్కరోజే అత్యధికంగా 5 లక్షల 70 వేలకుపైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఫ్లోరిడా, న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, జార్జియా, మసాచుసెట్స్, ఒహియో, పెన్సెల్వేనియా, నార్త్ కరోలినా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 55.25 కోట్లు (5,52,52,823) కి చేరింది. కొత్తగా 1362 మంది కోవిడ్ వలన మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 8.45 లక్షలకు (8,45,745) పెరిగింది. కాగా అమెరికాలో పెద్దఎత్తున కోవిడ్ వ్యాక్సినేషన్‌ చేపట్టడంతో గతకొన్ని నెలలుగా పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. అయితే తాజా పరిస్థితులతో మళ్ళీ ఆందోళన నెలకుంది. మరోవైపు అమెరికాతో పాటుగా యూకే, ఫ్రాన్స్ లలో కూడా రోజువారీగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − twelve =