మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు, నేటి నుంచే అమల్లోకి…

Amul Hikes Milk Prices of All Variants From 3rd Feb,Mango News, Mango News Telugu,Amul hikes milk price , Amul Milk Prices, Amul Milk Latest Prices, Amul Milk, Amul Hikes Milk Prices of All Variants, Amul Milk Rates, Amul Raises Milk Prices, amul milk price hike history, amul milk price news, amul milk price 1 litre, amul toned milk price

దేశంలో అమూల్ బ్రాండ్ పాల ధరలు మరోసారి పెరిగాయి. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ బ్రాండ్ పేరుతో పాలు మరియు పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమూల్ పౌచ్ పాల ధర (అన్ని రకాలు) ఫిబ్రవరి 3, శుక్రవారం ఉదయం నుంచి పైకి సవరించబడ్డాయని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ (సేల్స్) ప్రకాష్ ఆటే వెల్లడించారు. పెరిగిన ధరలు గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో అమలు కానున్నాయి. నిర్వహణ మరియు పాల ఉత్పత్తి యొక్క మొత్తం ఖర్చులో పెరుగుదల కారణంగానే తాజాగా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

పెంపు తరువాత అమూల్ పాల ధరలు:

 • అమూల్ తాజా 500 ఎంఎల్ – రూ.27
 • అమూల్ తాజా 1 లీటర్ – రూ.54
 • అమూల్ తాజా 2 లీటర్ – రూ.108
 • అమూల్ తాజా 6 లీటర్ – రూ.324
 • అమూల్ తాజా 180 ఎంఎల్ – రూ.10
 • అమూల్ గోల్డ్ 500 ఎంఎల్ – రూ.33
 • అమూల్ గోల్డ్ 1 లీటర్ – రూ.66
 • అమూల్ గోల్డ్ 6 లీటర్ – రూ.396
 • అమూల్ ఆవు పాలు 500 ఎంఎల్ – రూ.28
 • అమూల్ ఆవు పాలు 1 లీటర్ – రూ.56
 • అమూల్ ఎ2 గేదె పాలు 500 ఎంఎల్ – రూ.35
 • అమూల్ ఎ2 గేదె పాలు లీటర్ – రూ.70
 • అమూల్ ఎ2 గేదె పాలు 6 లీటర్ – రూ.420.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here