అనిల్ అంబానీ కీలక నిర్ణయం.. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు రాజీనామా

Anil Ambani Resigns as Director of Reliance Power and Reliance Infrastructure, Anil Ambani Resigns as Director of Reliance Power, Anil Ambani Resigns as Director of Reliance Infrastructure, Anil Ambani has resigned from the boards of directors of both Reliance Power and Reliance Infrastructure, Reliance Power and Reliance Infrastructure, Reliance Power, Reliance Infrastructure, Anil Ambani Resigns, Reliance Group Chairman Anil Ambani, Anil Ambani Chairman Of Reliance Group, Anil Ambani steps down as director of R-Infrastructure And R-Power, Anil Ambani, reliance power news, reliance power Latest News, reliance power Latest Updates, Ambani, Reliance, Mango News, Mango News Telugu,

దేశంలోని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ శుక్రవారం రిలయన్స్ పవర్ మరియు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. దీనిపై రిలయన్స్ పవర్ స్పందిస్తూ.. “సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా రిలయన్స్ పవర్ బోర్డు నుండి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ డి అంబానీ వైదొలిగారు” అని బిఎస్‌ఇ ఫైలింగ్‌లో తెలిపింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరియు మరో ముగ్గురు వ్యక్తులను సెక్యూరిటీస్ మార్కెట్ నుండి కంపెనీ నుండి నిధులు స్వాహా చేశారనే ఆరోపణలపై ఫిబ్రవరిలో సెబీ నిషేధించింది.

అలాగే అంబానీని, సెబీలో నమోదు చేసుకున్న ఏదైనా మధ్యవర్తితో, ఏదైనా లిస్టెడ్ పబ్లిక్ కంపెనీతో లేదా పబ్లిక్ కంపెనీ యాక్టింగ్ డైరెక్టర్లు/ప్రమోటర్లతో తదుపరి ఆర్డర్‌ల వరకు ప్రజల నుండి డబ్బును సేకరించకుండా నియంత్రిస్తూ రెగ్యులేటర్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అనిల్ అంబానీ స్థానంలో రాహుల్ సరిన్ ను ఆర్‌పవర్ మరియు ఆర్‌ఇన్‌ఫ్రా బోర్డులలో ఐదేళ్ల కాలానికి ఇండిపెండెంట్ డైరెక్టర్ హోదాలో అదనపు డైరెక్టర్‌గా నియమితులైనట్లు రెండు రిలయన్స్ గ్రూప్ కంపెనీలు తెలిపాయి. రాహుల్ సరిన్ 35 సంవత్సరాలకు పైగా ప్రజా సేవలో ఉన్నాడు, ఇంతకుముందు భారత ప్రభుత్వ కార్యదర్శిగా కూడా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం ఆఫ్థోనియా ప్రైవేట్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా పనిచేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =