నేటి నుంచే ఆసియా కప్-2022 సూపర్-4 రౌండ్: రేపు భారత్, పాక్ మధ్య మరోసారి పోరు, షెడ్యూల్ ఇదే

Asia Cup-2022 Super 4 Round Starts From Today Again India Vs Pakistan Match on September 4th, Super 4 Round Starts From Today, India Vs Pakistan Match on September 4th, Asia Cup-2022 Super 4 Round, Super 4 Round, India Vs Pakistan Match, Ind VS Pak Match, Asia Cup-2022, 2022 Asia Cup, Asia Cup-2022 Super 4 Round News, Asia Cup-2022 Super 4 Round Latest News And Updates, Asia Cup-2022 Super 4 Round Live Updates, Mango News, Mango News Telugu,

ఆసియా కప్-2022 లో ఉత్కంఠభరిత మ్యాచ్ లు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న విషయం తెలిసిందే. యూఏఈలోని దుబాయ్ మరియు షార్జా వేదికల్లోనే ఈ టోర్నీ యొక్క మొత్తం 13 మ్యాచ్‌ లు జరగుతుండగా, శుక్రవారం జరిగిన హాంకాంగ్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ తో లీగ్ దశ మ్యాచ్ లు ముగిశాయి. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌ రెండు విజయాలతో, పాకిస్థాన్‌ ఒక విజయంతో మొదటి రెండు స్థానాల్లో నిలిచి సూపర్ 4 రౌండ్ కి చేరుకోగా, హాంకాంగ్ జట్టు ఇంటిబాట పట్టింది, అదేవిధంగా గ్రూప్‌-బిలో ఆఫ్ఘానిస్థాన్‌ రెండు విజయాలతో, శ్రీలంక జట్టు ఒక విజయంతో మొదటి రెండు స్థానాల్లో నిలిచి సూపర్ 4 రౌండ్ కి చేరుకున్నాయి. ఆఫ్ఘానిస్థాన్‌, శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లలో పరాజయంతో బంగ్లాదేశ్‌ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ నేపథ్యంలో నేటి నుంచి సూపర్-4 రౌండ్ ప్రారంభం కానుంది. అందులో సూపర్ 4లో మొత్తం ఆరు మ్యాచ్ లు జరగనుండగా, మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్-4 రౌండ్ లో భాగంగా ముందుగా శనివారం రాత్రి 7:30 గంటలకు ఆఫ్ఘానిస్థాన్‌, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఇక మ్యాచ్ 2లో భాగంగా ఆదివారం రాత్రి 7:30 గంటలకు దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు ఆసియా కప్‌ లో మరోసారి తలపడనున్నాయి. దాయాదుల మధ్య పోరుకై క్రీడాభిమానులు మరోసారి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సెప్టెంబర్ 11న జరిగే ఫైనల్‌ మ్యాచ్ తో ఆసియా కప్-2022 ముగియనుంది.

ఆసియాకప్ సూపర్-4 రౌండ్ షెడ్యూల్:

  • సెప్టెంబర్ 3: ఆప్ఘనిస్తాన్ Vs శ్రీలంక – షార్జా
  • సెప్టెంబర్ 4: భారత్ Vs పాకిస్తాన్ – దుబాయ్
  • సెప్టెంబర్ 6: భారత్ Vs శ్రీలంక – దుబాయ్
  • సెప్టెంబర్ 7: పాకిస్తాన్ Vs ఆఫ్గనిస్తాన్ – దుబాయ్
  • సెప్టెంబర్ 8: భారత్ Vs ఆఫ్గనిస్తాన్ – దుబాయ్
  • సెప్టెంబర్ 9: శ్రీలంక Vs పాకిస్తాన్ – దుబాయ్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − two =