ఆసియా కప్‌ సూపర్‌-4: నేడు శ్రీలంకతో భారత్‌ కీలక మ్యాచ్‌, రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిందే

Asia Cup 2022 Team India To Face Sri Lanka in a Must-Win Super 4 Clash Today, India And Sri Lanka Super 4 Match, Asia Cup Super4 Match, India vs Sri Lanka Asia Cup 2022, India vs Sri Lanka Latest News And Updates, India vs Sri Lanka Live Updates, Asia Cup 2022, Ind vs Sri Lanka Asia Cup 2022, India vs Sri Lanka Highlights, India Against Sri Lanka , IND vs Sri Lanka Highlights, Ind vs Sri Lanka Live Streaming, Ind Vs Sri Lanka Match Score, Mango News, Mango News Telugu

ఆసియాకప్‌ లీగ్‌ దశలో అదరగొట్టిన టీమిండియా సూపర్ 4 దశలో ఒక్క ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పడింది. దాయాది పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో.. ఈరోజు టీమిండియా శ్రీలంకతో తలపడనుంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయంతో అభిమానులకు ఆనందాన్ని పంచుతుందా, లేదా అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఈ మ్యాచ్‌లో కనుక టీమిండియా ఓడితే ఫైనల్ చేరే అవకాశాలు లేనట్లే. దీంతో యాజమాన్యం జట్టులో కొన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గత మ్యాచ్‌లో భారత ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇవ్వడం, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫామ్ కొనసాగిస్తుండటం కలిసొచ్చే అంశమే. అయితే బౌలింగ్‌లో సరైన ప్రత్యామ్నాయాలు లేకపోవడం జట్టుకి ఇబ్బంది కలిగిస్తోంది. ఒత్తిడి సమయాల్లో యువ బౌలర్లు తేలిపోతున్నారు. గాయం కారణంగా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా జట్టుకు దూరమవడం టీమిండియాకు పెద్ద లోటు. మరోవైపు గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయంతో ఊపుమీదున్న లంక భారత్‌కు గట్టి పోటీనివ్వాలని భావిస్తోంది. బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌లపై పట్టు విడవకుండా తుదికంటా పోరాడి విజయం సాధించింది. ఇక ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో ఆసియా కప్ సాధించడం ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో నేడు జరుగనున్న మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. ఈ మ్యాచ్ మంగళవారం రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌, కార్తీక్‌/పంత్‌, పాండ్యా, అక్షర్‌, భువనేశ్వర్‌, అవేశ్‌ ఖాన్‌, అర్శ్‌దీప్‌, చాహల్‌.

శ్రీలంక: షనక (కెప్టెన్‌), నిస్సాంక, కుశాల్‌ మెండిస్‌, అసలంక, గుణతిలక, రాజపక్స, హసరంగ, కరుణరత్నె, తీక్షణ/జయవిక్రమ, ఫెర్నాండో, మధుషనక.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =