కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆసియా గేమ్స్-2022 వాయిదా

Asian Games Hangzhou 2022 Postponed due to Covid-19 Pandemic, Asian Games Hangzhou 2022 Postponed, 2022 Asian Games Hangzhou Postponed due to Covid-19 Pandemic, Covid-19 Pandemic, 2022 Asian Games Hangzhou Postponed, 2022 Asian Games Postponed, Asian Games Postponed, Asian Games, Asian Games Hangzhou, Asian Games Hangzhou News, Asian Games Hangzhou Latest News, Asian Games Hangzhou Latest Updates, Asian Games Hangzhou Live Updates, China Covid-19 Updates, China Covid-19 Live Updates, China Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, China Coronavirus, China Coronavirus Cases, China Coronavirus Deaths, China Coronavirus New Cases, China Coronavirus News, China New Positive Cases, Mango News, Mango News Telugu,

చైనాలోని హాంగ్‌జౌ నగరంలో సెప్టెంబర్‌ 10 నుంచి 25వ తేదీ వరకు జరగాల్సిన ఆసియా గేమ్స్-2022 కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) ఒక ప్రకటన చేసింది. “కొనసాగుతున్న కరోనా మహమ్మారి ప్రభావం మరియు అథ్లెట్లు, అభిమానులు, సహాయక సిబ్బంది ఆరోగ్యం మరియు భద్రతను పరిగణనలోకి తీసుకుని, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ఎగ్జిక్యూటివ్ బోర్డ్ 19వ ఆసియా గేమ్స్ హాంగ్‌జౌ-2022ని వాయిదా వేయాలని నిర్ణయించింది. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా, చైనీస్ ఒలింపిక్ కమిటీ మరియు హాంగ్‌జౌ ఆసియన్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ మధ్య అంగీకారం కుదిరిన తర్వాత ఆసియా గేమ్స్-2022 నిర్వహించబడే కొత్త తేదీలు ప్రకటించబడతాయి” అని ఓసీఏ ప్రకటనలో తెలిపింది.

ఈ నిర్ణయం హాంగ్‌జౌ నగరానికి, క్రీడాకారులకు మరియు ప్రపంచ అభిమానులకు ప్రయోజనం చేకూరుస్తుందని గట్టిగా నమ్ముతున్నామని ఓసీఏ పేర్కొంది. కాగా గత కొన్ని రోజులుగా చైనా దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో చాలా నగరాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంది. కోవిడ్ తీవ్రత ఎక్కువుగా ఉన్న షాంఘై నగరానికి సమీపంలోనే హాంగ్‌జౌ నగరం ఉండడం, తదుపరి పరిణామాల దృష్ట్యానే హాంగ్‌జౌలో జరగాల్సిన ఆసియా గేమ్స్-2022ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here