హైద‌రాబాద్‌లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో 12వ తేదీ నుంచి మూడు పూటలా ఉచిత భోజ‌నం – మంత్రి హ‌రీష్ రావు

Hyderabad Minister Harish Rao Announces Free Meals To Be Provided at Government Hospitals From 12th May, Minister Harish Rao Announces Free Meals To Be Provided at Government Hospitals From 12th May, Free Meals To Be Provided at Government Hospitals From 12th May, Government Hospitals, Free Meals To Be Provided at Government Hospitals, Telangana Minister Harish Rao Announces Free Meals To Be Provided at Government Hospitals From 12th May, Telangana Minister Harish Rao, Minister Harish Rao, Telangana Minister, Harish Rao, Telangana Health Minister, Health Minister Harish Rao, Government Hospitals Free Meals, Government Hospitals Free Meals News, Government Hospitals Free Meals Latest News, Government Hospitals Free Meals Latest Updates, Government Hospitals Free Meals Live Updates, Mango News, Mango News Telugu,

ఈ నెల 12వ తేదీ నుంచి హైద‌రాబాద్‌ నగరంలోని 18 ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మూడు పూటలా ఉచిత భోజ‌నం కార్య‌క్ర‌మం ప్రారంభమవుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు. ఈరోజు కోఠి మెట‌ర్నిటీ హాస్పిట‌ల్‌లో ఏర్పాటు చేసిన‌ ఐసీయూ, లేబ‌ర్ రూమ్స్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. కోఠిలోని ఈఎన్టీ హాస్పిట‌ల్‌లో రూ. 35 కోట్ల‌తో భవనం నిర్మించనున్నామని, దీనిలో 110 ప‌డ‌క‌లు, 8 ఆప‌రేష‌న్ థియేట‌ర్లు, అధునాత‌న సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు.

12వ తేదీ నుంచి హైద‌రాబాద్‌ నగరంలోని 18 ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మూడు పూటలా నాణ్య‌మైన ఉచిత‌ భోజనం అందించనున్నామని హ‌రీష్ రావు వెల్లడించారు. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న పేషెంట్స్ కు ఆస్ప‌త్రి లోప‌ల భోజ‌నం అందిస్తామని, అదే విధంగా చికిత్స పొందుతున్న తమ సహాయకుల కోసం కేవలం రూ. 5 లకే భోజనం అందించబడుతుందని తెలిపారు. ఒక రోజుకి రూ. 15 లకు వేడి, తాజా ఆహారాన్ని అందిస్తామని చెప్పారు. దీనివల్ల రోజుకు 18,600 మందికి లబ్ధి చేకూరనుందని, పేద, మధ్యతరగతి రోగులను పట్టించుకునే ప్రభుత్వం రూ.24.25 ఖర్చు చేసే భోజనంపై రూ.19.25 సబ్సిడీ చెల్లిస్తోందని. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.38.66 కోట్ల అదనపు భారం పడనుందని మంత్రి తెలిపారు.

ఆర్థికంగా వెనుకబడిన, పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం అలాంటి సౌకర్యం కోసం హరేకృష్ణ మూవ్‌మెంట్ అనే స్వచ్ఛంద సంస్థతో గత నెలలో ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి హ‌రీష్ రావు తెలిపారు. కాగా ఉదయం మెనూలో పెరుగన్నం, పులిహోర, వెజిటబుల్ పలావ్, సాంబార్ రైస్‌తో పాటు ఉదయం టిఫిన్‌కు ఆకుకూరలు ఉంటాయి. మధ్యాహ్నం మరియు రాత్రి భోజనంలో, అన్నం, సాంబార్ లేదా పప్పు, ఆకుకూరలు మరియు కూరగాయలు మెనులో రోగి బంధువులకు వడ్డిస్తారు. డిస్పోజల్ గ్లాస్, ప్లేట్‌తో పాటు చల్లని మంచినీళ్లు కూడా సరఫరా చేస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =