జాబ్ ఇవ్వకపోవడానికి కొత్త రీజన్.. బెంగళూరు యువతికి షాక్ ఇచ్చిన కంపెనీ

Bengaluru Woman Claims She was Rejected For A Job as Her Skin Tone is Little Fair,Bengaluru Woman Claims,Rejected For A Job as Her Skin Tone,Rejected For A Job as Her Skin Tone is Little Fair,Bengaluru Woman Rejected For Little Fair,Mango News,Mango News Telugu,Bangalore, reason for not giving a job,The company shocked the young woman of Bangalore,Pratiksha Jichkar, Pratiksha,Bengaluru woman denied job offer,Rejected For Having Fair Skin,Bengaluru Woman Shares Companys Rejection,Bengaluru womans job application,Bengaluru Woman Latest News,Bengaluru Woman Latest Updates,Bengaluru Woman Live News

కరోనా తర్వాత అందరి ఆర్థిక పరిస్థితులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆర్థికంగా దిగజారిపోయాయి. దీనివల్ల జాబ్ మార్కెట్ మరీ అధ్వాన్నంగా తయారయింది. కొన్ని కంపెనీలు ఉన్న ఉద్యోగాలు పీకేస్తుంటే.. మరి కొన్ని కంపెనీలు కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి కుంటి సాకులు చెబుతోంది. రిక్రూట్మెంట్ ప్రకటనలు కూడా ఫార్మాలిటీ కోసం ఇస్తూ.. ఆన్ బోర్డు కావాలసిన వారికి సిల్లీ కారణాలు చెబుతూ చివరకు నవ్వుల పాలవుతున్నారు.

తాజాగా బెంగళూరుకు చెందిన ప్రతీక్ష జిచ్కర్ అనే యువతికి ఇలాగే ఓ వింత అనుభవం ఎదురైంది. తనకు నచ్చిన ఉద్యోగం కోసం ఓ కంపెనీలో చాలా రౌండ్ల ఇంటర్వ్యూలకు ఆమె అటెండ్ అయింది. ఇక ఆల్మోస్ట్ జాబ్ కన్ఫమ్ అనుకుంటున్న సమయంలో ప్రతీక్షకు.. ఆ కంపెనీ నుంచి సెలెక్ట్ కాలేదని మెయిల్ వచ్చింది. వేరే స్ట్రాంగ్ రీజన్ చెప్పి నో అన్నా.. తను అంతగా ఫీలయి ఉండేది కాదేమో కానీ ఆమె సెలక్ట్ కాకపోడానికి చెప్పిన కారణంతో ఆ యువతి ఒక్కసారిగా ఆమె షాక్ అయింది. ఎందుకంటే.. ఆమె స్కిన్ టోన్ ఫెయిర్ గా ఉందన్న కారణంగానే ఆమెకు జాబ్ ఆఫర్ చేయలేమని సదరు కంపెనీ మెయిల్ చేసిందట.

కంపెనీ చెప్పిన రీజన్ తో బాగా మండిన ప్రతీక్ష.. ఆ మెయిల్ స్క్రీన్‌ షాట్‌ను లింక్డ్ ఇన్‌‌లో పోస్ట్ చేయడంతో ఈ మ్యాటర్ కాస్తా బయటకు వచ్చింది. ఏఐ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలతో దూసుకుపోతున్న ఈ సాంకేతిక యుగంలోనూ.. వివక్ష మాత్రం ఇంకా అలాగే ఉందని ఆమె కామెంట్ చేసింది. అయితే ఆ యువతి కంపెనీ పేరు మాత్రం బయటకు చెప్పలేదు. సమాన అవకాశాలు, వివక్ష చూపించకుండా అవకాశాలు పేరుతో కంపెనీలు ఇటువంటి చర్యలకు దిగకూడదనే తాను ఈ పోస్ట్‌ను తాను బయట పెట్టినట్లు ప్రతీక్ష చెప్పుకొచ్చింది.

ప్రతీక్ష చేసిన పోస్ట్‌పై చాలామంది నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఏ కంపెనీ కూడా తాము ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లను తిరస్కరిస్తూ కారణాన్ని ఇలా మెయిల్ చేసి చెప్పరని అంటున్నారు. ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. తగిన క్వాలిఫికేషన్స్ లేకపోడం వల్ల రిజెక్ట్ చేయడం చూశాం కానీ.. ఇలా ఫెయిర్ గా ఉందనే కారణంతో తిరస్కరించినట్లు వినడం ఇదే మొదటి సారని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే తర్వాత ప్రతీక్ష.. తన లింక్డ్ ఇన్ కామెంట్స్‌ను డిసేబుల్ చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ మ్యాటర్ ఇప్పుడు ట్విట్టర్, రెడ్డిట్‌ లో ఇప్పటికే ఇది బాగా వైరల్ గా మారిపోయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − nine =