భారత్‌లో తయారైన ఆ దగ్గు మందు కలుషితం.. WHO అలర్ట్‌

WHO Issued Alert on Another India made Contaminated Cough Syrup,WHO Issued Alert on Another India made,India made Contaminated Cough Syrup,WHO Issued Alert, Mango News,Mango News Telugu,Tested samples of Guaifenesin TG syrup,WHO statement on Cough Syrup,WHO,India cough medicine is contaminated WHO alert, cough medicine, ColdOut cough,Contaminated Cough Syrup,WHO Issued Alert Latest News,WHO Issued Alert Latest Updates,WHO Issued Alert Live News,Contaminated Cough Syrup News Today,WHO Alert on India made Latest News

ఇండియాలో తయారై ఇరాక్‌లో అమ్ముతున్న కోల్డ్ అవుట్ అనే దగ్గు, జలుబు మందు సిరప్‌లో కలుషితమైన ఔషధాలనున్నట్లు పరిశోధనల్లో తేలిందంటూ.. బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది. యూఎస్ కు చెందిన ఓ ఇండిపెండెంట్‌ ల్యాబరేటరీ కంపెనీ.. వాలిసూర్ ల్యాబ్‌ ఈ 2023 మార్చిలో.. ఇరాక్‌ రాజధాని అయిన బాగ్దాద్‌కు చెందిన ఓ ఫార్మసీలో కోల్డ్ అవుట్ అనే సిరప్ కొని దానిపై రీసెర్చ్‌ చేసింది.

ఇలా వాలిసూర్‌ పరిశోధనల్లో.. ఇండియాకు చెందిన కోల్డ్ అవుట్ దగ్గుమందులో 2.1% ఇథలీన్ గ్లైకాల్ నమూనాలు ఉన్నట్లు తేల్చింది. మామూలుగా దగ్గుమందుల్లో ఇది వాడతారు. కానీ వినియోగించాల్సిన శాతం కంటే కూడా 21 రెట్లు ఎక్కువగా ఈ దగ్గు మందులో ఉన్నట్లు గుర్తించింది. అంతేకాదు ఇది ప్రాణాంతకమవుతుందన్న నిజాన్ని వెలుగులోకి తెచ్చింది.

2022లో ఇండియాలో తయారైన మైడెన్‌ ఫార్మా తయారు చేసిన కోల్డ్ అండ్ కాఫ్ సిరప్‌లలో ఇదే ఇథలీన్‌ గ్లైకాల్‌ ఎక్కువ మోతాదులో ఉంది. అప్పుడు ఈ సిరప్‌ తాగి ఆఫ్రికాలోని 70 మంది చిన్నారులు మరణించిన విషయం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. ఆ విషయాన్నే ఇంకా చాలామంది మర్చిపోకముందే ఇప్పుడు అదే ఇథలీన్‌ గ్లైకాన్‌.. తాజా వాలిసూర్‌ పరిశోధనలు జరిపిన సిరప్‌లో ఉన్నట్లు గుర్తించింది.

జులై 8న బ్లూమ్‌బెర్గ్ ఈ టెస్ట్ ఫలితాలను డబ్ల్యూహెచ్‌వోతో పాటు, ఇరాక్‌ ప్రభుత్వ అధికారులకు, అలాగే భారత అధికారులకు కూడా సమాచారం అందించింది. వాలిసూర్‌ ఫలితాలపై డబ్ల్యూహెచ్‌వో అలర్ట్‌ అయ్యింది. వాలిమర్‌ రీసెర్చ్‌ ఫలితాలను తాము ఆమోదిస్తున్నామని.. ఇరాక్‌ ప్రభుత్వం ఈ సిరప్‌లను విక్రయిస్తే.. హెచ్చరికలు జారీ చేస్తామని వెల్లడించింది.

వాలిమర్‌ రీసెర్చ్‌ ఫలితాలపై ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాత్రం.. భారత్ పార్మా కంపెనీ తయారు చేసిన ఈ కోల్డ్ అవుట్ గురించి మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. కానీ ఔషధాల ఇంపోర్ట్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్ కోసం మంత్రిత్వ శాఖ కఠినమైన నిబంధనలను కలిగి ఉందని.. వాటిని తాము పాటిస్తున్నామని అన్నారు.

ఇరాక్‌లో కొని వాలిసూర్ ల్యాబ్‌ లో పరిశోధించిన ఈ సిరప్‌లను చైన్నైకి చెందిన ఫోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసినట్లు భారత దేశపు అధికారులు గుర్తించారు. ఈ సంస్థ జర్మనీ, కెనడాతో పాటు 50 కంటే ఎక్కువ కంట్రీలకు ఈ సిరప్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఆ సిరప్‌ తయారీని.. ఆ కంపెనీ పుదుచ్చేరికి చెందిన షారున్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని అధికారులు గుర్తించారు. అయితే ఇంకా ఈ కంపెనీ గురించి, కోల్డ్‌ అవుట్‌ సిరప్‌ గురించి పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

గత సంవత్సరం హర్యానాలోని సొనెపట్‌ కేంద్రంగా.. మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ తయారు చేసిన 4 దగ్గు, జలుబు సిరప్‌లు వాడటం వల్ల ఆఫ్రికా దేశమైన గాంబియాలో 70 మంది చిన్నారులు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తు చేసింది. అప్పుడు పిల్లల మరణాలకు సిరప్‌లలోని ఇథిలీన్ గ్లైకాల్ కారణమని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది. WHO హెచ్చరికలతో ఇండియన్ ఫార్మా కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలను తెలుసుకోవడానికి కేంద్రం సిద్ధమవుతోంది.

మరోవైపు గతేడాది వచ్చిన ఆరోపణలతో మైడెన్‌ ఫార్మా తయారు చేసిన కోల్డ్ అండ్ కాఫ్ సిరప్‌లపై భారత ఆరోగ్య శాఖ చాలా రకాల తనిఖీలు నిర్వహించింది. ఆ పరీక్షలన్నింటిలోనూ ఎలాంటి లోపాలు వెలుగు చూడలేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. గాంబియా ప్రభుత్వం తమను సంప్రదిస్తే తమ నివేదిక ప్రకారం బదులిస్తామని అన్నారు. అయితే ఇరాక్ లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా.. మరోసారి అవే ఆరోపణలు రావడంతో భారత్ ఫార్మా కంపెనీలు, కేంద్రం ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − ten =