ప్రియుడి కోసం ప్రియురాలు పవర్ కట్.. ఊరి వాళ్లు భలే కనిపెట్టారు

Bihar Girl Cuts Off Power Supply of Entire Village at Bettiah to Meet Her Boyfriend,Bihar Girl Cuts Off Power Supply of Entire Village,Cuts Off Power Supply of Entire Village,Bihar Girl Cuts Off Power to Meet Her Boyfriend,Bihar Girl Cuts Off Power at Bettiah,Cuts Off Power Supply at Bettiah to Meet Her Boyfriend,Mango News,Mango News Telugu,Girlfriend power cut for boyfriend, Bihar,Daring Lover, Lover,Bihar Girl Latest News,Bihar Girl Latest Updates,Bihar Girl Cuts Off Power News Today

అనగనగా ఓ గ్రామం. అక్కడ రోజూ కరెంట్ పోతుంది. అది కూడా రాత్రివేళ ఒకే సమయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. గత కొంత కాలంగా అక్కడ ఇదే పరిస్థితి. కరెంట్ లేక ఆ గ్రామం మొత్తం నిత్యం చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి. అలా అని అధికారికంగా పవర్ కట్ ఉందా అంటే.. అలాంటిదేమి లేదు. ఇక ఇదే సమయంలో బైకులు, కరెంటు మోటార్లు, మేకలు ఇతరత్రా చోరీ అవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అసలు గ్రామంలో ఏం జరుగుతుందోనని తెలుసుకునేందుకు ఓ రోజు రాత్రి గ్రామస్తులు మాటు వేశారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఓ సన్నివేశం చూసిన వారంతా ఒక్కసారిగా కంగుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే.. మీరు కూడా అవాక్కవుతారు.

బీహార్‌లోని బేతియా జిల్లా నౌతన్‌ పోలీస్‌స్టేషను పరిధిలోని ఓ గ్రామంలో విచిత్రకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన యువతి.. ఓ యువకుడ్ని ప్రేమించింది. అతడ్ని రోజూ రాత్రి పూట ఏకాంతంగా కలుసుకునేది. ఎవరి కంట పడకుండా ఉండేందుకు ప్రియుడు వచ్చే సమయానికి పెద్ద పన్నాగమే పన్నింది. ఆమె సరసాల సౌఖ్యం కోసం ఏకంగా గ్రామంలో పవర్ లేకుండా చేస్తుంది. స్థానికంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మరు దగ్గరకు వెళ్లి విద్యుత్తు సరఫరాను నిలిపివేసేది. ఇక రోజు ఇదే తంతు. అదే సమయంలో ఆ గ్రామంలో చోరీలు జరుగుతున్నాయి. అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇక ఎలాగైనా ఆ దొంగలను పట్టుకోవడంతో పాటు.. ఒకే సమయానికి నిత్యం కరెంట్ ఎందుకు పోతుందో.. ఎవరు కారకులో కనిపెట్టాలని గ్రామస్తులంతా నిర్ణయించారు.

రాత్రి బాగా చీకటి పడిన తర్వాత ఓ యువతి ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరకు వచ్చి.. విద్యుత్ సరఫరా నిలివేయడం గ్రామస్తులు చూసి షాకయ్యారు. ప్రేమికులిద్దర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాత్రిపూట తన ప్రియుడ్ని కలుసుకోడానికి ఇలా చేస్తున్నట్టు ఆమె చెప్పడంతో విస్తుపోయారు. యువకుడికి కొందరు దేహశుద్ధి కూడా చేశారు. అయితే, యువతి మాత్రం తాము ఇద్దరం ప్రేమించుకున్నామని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. అంతేకాదు, తమను వేధించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు దిగింది. దీంతో విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. దాంతో ఈ ప్రేమజంట పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో పవర్ ప్రేమ కథ.. పెళ్లి పీటలెక్కింది.

ఇక గతేడాది కూడా బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. గణేశ్‌పూర్ గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్.. తన ప్రియురాలిని ఏకాంతంగా కలవడానికి.. ఇలా చేస్తుండగా.. ఒక రోజు అడ్డంగా దొరికిపోయాడు. రాత్రి వేళలో విద్యుత్ సరఫరా నిలివేసి.. ఆమె ఇంటికి వెళ్లి కలుసుకునేవాడు. రోజూ కరెంట్ ఎందుకు పోతుందోనని అనుమానించిన గ్రామస్తులు.. కాపలా కాయడంతో అతడి నిర్వాకం వారి కంట పడింది. ఇంకేముంది అతడ్ని పట్టుకుని దేహశుద్ధి చేసి తగిన బుద్ది చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =