బ్లాక్‌ పాంథర్‌ నటుడు చాడ్విక్ బోస్‌మాన్ కన్నుమూత

Black Panther Star, Black Panther Star Chadwick Boseman, Black Panther Star Chadwick Boseman Dies of Colon Cancer, Black Panther Star Chadwick Boseman Dies of Colon Cancer at 43, Chadwick Boseman, Chadwick Boseman Dies of Colon Cancer

ప్రముఖ హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్‌మాన్ కన్నుమూశారు. ఆయన వయసు 43 సంవత్సరాలు. నాలుగు సంవత్సరాలుగా కోలన్‌(పెద్దపేగు) క్యాన్సర్‌తో చాడ్విక్ పోరాడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. బ్లాంక్ పాంథర్ చిత్రం చాడ్విక్ బోస్‌మాన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిపెట్టింది. ముందుగా మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ చిత్రంలో బ్లాక్ పాంథర్ గా చాడ్విక్ బోస్‌మాన్ పాపులారిటీ పొందాడు. 2018లో తను నటించిన బ్లాక్ పాంథర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసి, ఆ సంవత్సరం అంతర్జాతీయంగా అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్‌గేమ్‌, మార్షల్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను బోస్‌మాన్ విశేషంగా ఆకట్టుకున్నారు.

కాన్సర్ తో పోరాడుతూ, చికిత్స మరియు కీమోథెరపీ తీసుకుంటున్న సమయంలో కూడా చాడ్విక్ బోస్‌మాన్ షూటింగ్స్ లో పాల్గొని తన ధైర్యాన్ని, స్ఫూర్తిని చూపించాడని సహచరులు అభినందిస్తున్నారు. సూపర్ హీరోగా హాలీవుడ్‌ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన చాడ్విక్ మరణంతో హాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. చాడ్విక్ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా పలు సినీ పరిశ్రమల ప్రముఖులు, నటీనటులు, నిర్మాణ సంస్థలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + seventeen =