బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు.. సంచలన విషయాలు వెల్లడించిన మార్చురీ సహాయకుడు

Bollywood Actor Sushant Singh Rajput's Demise Didn't Appear as Suicide Claims Mortuary Worker at Mumbai's Cooper Hospital,Bollywood Actor Sushant Singh Rajput,Sushant Singh Rajput's Demise,Mortuary Worker On Sushant Singh Rajput's Demise,Mango News,Mango News Telugu,Mumbai's Cooper Hospital,Sushant Singh Rajput Movies,Sushant Singh Rajput Songs,Sushant Singh Rajput Age,Sushant Singh Rajput Death Reason,Sushant Singh Rajput Wife,Sushant Singh Rajput Latest News,Sushant Singh Rajput News,Sushant Singh Rajput Death Date,Sushant Singh Rajput Family,Sushant Singh Rajput Family Accident,Sushant Singh Rajput Movies List,Drive Movie Sushant Singh Rajput,Sushant Singh Rajput Movies,Sushant Singh Rajput Songs,Sushant Singh Rajput Age,Sushant Singh Rajput Death Reason,Sushant Singh Rajput Wife,Sushant Singh Rajput Latest News,Sushant Singh Rajput News,Sushant Singh Rajput Death Date,Sushant Singh Rajput Family,Sushant Singh Rajput Family Accident,Sushant Singh Rajput Movies List,Drive Movie Sushant Singh Rajput

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మరోసారి వివాదం చెలరేగింది. సుశాంత్ చనిపోయి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ ఆయన మృతి వెనకున్న మిష్టరీ వీడటం లేదు. కాగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. 34 సంవత్సరాల వయస్సులో జూన్ 14, 2020న ముంబైలోని బాంద్రాలో గల తన నివాసంలో నిర్జీవంగా పది ఉన్న స్థితిలో కనిపించాడు. అయితే పోస్టుమార్టం అనంతరం ముంబై పోలీసులు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు రిపోర్టులో వెల్లడించారు. కానీ చాలామంది దానిని నమ్మలేదు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడని, అతనికి అలాంటి పరిస్థితి కూడా లేదని వాదించారు.

వీరి వాదనలకు బలం చేకూర్చేలా తాజాగా ఒక వ్యక్తి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ఆరోపణలు చేస్తున్న వ్యక్తి సుశాంత్‌కు పోస్టుమార్టం నిర్వహించిన బృందంలోని ఒక సభ్యుడు కావడంతో దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ముంబైలోని కూపర్ హాస్పిటల్‌లోని మార్చురీ సహాయకుడు అయిన రూప్‌కుమార్ షా సుశాంత్‌ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, దీనిని ప్రధాన డాక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపాడు. తాను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహాన్ని చూసినప్పుడు అది ఆత్మహత్యగా అనిపించలేదని, అతని శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని రూప్‌కుమార్ షా చెప్పాడు. తనకు ఈ వృత్తిలో 28 సంవత్సరాల అనుభవం ఉందన్న షా, సాధారణంగా ఉరి కేసుల్లో కనిపించే గుర్తులు సుశాంత్ శరీరంపై లేవని షా స్ఫష్టం చేశాడు.

అదే సందర్భంలో సుశాంత్ శరీరంపై ఫ్రాక్చర్ గుర్తులు ఉన్నాయని, దీనిని తన సీనియర్‌తో సంప్రదించానని, అయితే అతను దానిని తరువాత చర్చిద్దామని చెప్పాడని రూప్‌కుమార్ గుర్తు చేసుకున్నాడు. ఇక పోస్టుమార్టం రిపోర్టులో ఏం రాయాలి అనేది డాక్టర్ పని అని, అయితే రాజ్‌పుత్‌ హత్యకు గురైనట్లు చూసినవారెవరైనా ఇట్టే చెప్పేస్తారని షా తెలిపాడు. ఇక దీనిలో తనకు తెలిసిన విషయాన్ని దర్యాప్తు సంస్థకు కూడా చేబుతానని, సుశాంత్‌కు న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని రూప్‌కుమార్ షా పేర్కొన్నాడు. ఇక ఈ కేసులో డ్రగ్స్ సంబంధిత ఆరోపణలు రావడంతో సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిని సెప్టెంబర్ 8, 2020న ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పలు దఫాలుగా విచారణ జరపగా, ఆమె దాదాపు నెల రోజులపాటు బైకుల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. అయితే ఎట్టకేలకు అక్టోబర్‌ 7, 2020న రియా చక్రవర్తికి బెయిల్ బాంబే హైకోర్టు మంజూరు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 7 =