సెస్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ప్రజలు మరోసారి తేల్చి చెప్పారు – కేటీఆర్

BJP has No Place in Telangana People Once Again Proved with the Result of CESS Elections KTR,Results Of Cess Elections,Bjp Has No Place In Telangana Ktr,Telangana Minister Ktr,Mango News,Mango News Telugu,Sircilla Cess Polls,Cess Elections,Brs Show In Cess Polls,Bjp Erram Mahesh,Cess Electricity,Cess Example,Cess Electricity Bill,Cess Electricity Bill Payment,Cess Expansion,Cessnock Council Elections,Cessnock Council Elections 2021,Cessnock Council Elections 2021 Results,Cessnock Local Elections,Cessnock Council Elections Candidates,Cessnock Local Government Elections,Elections Cessy,Elections Cesson,Resultats Elections Cesson Sevigne,Elections Cesson Sevigne

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్ని కుయుక్తులు పన్నినా సిరిసిల్ల జిల్లాలో జరిగిన కో-ఆపరేటివ్‌ ఎలక్ట్రిసిటీ సప్లయ్‌ సొసైటీ (సెస్‌) ఎన్నికల్లో గెలువ లేకపోయిందని, మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అన్నారు. సెస్ ఎన్నికలలో అడ్డదారిన గెలిచేందుకు బీజేపీ సాధారణ ఎన్నికల మాదిరి అన్ని ప్రయత్నాలను చేసిందని, అయితే బీజేపీ కుటిల ప్రయత్నాలను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించి, తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పారని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని సంపూర్ణంగా ప్రవేటికరించి, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రలకు ఇది ఒక గుణపాఠంగా మారుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ విద్యుత్ సంస్కరణల పేరిట చేస్తున్న కుట్రలపై సాధారణ ప్రజలకు సైతం సంపూర్ణ అవగాహన ఉన్నదని, అందుకే సెస్ ఎన్నికల్లో ఆ పార్టీని తిరస్కరించినట్లు కేటీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని మరోసారి ప్రజలు తేల్చి చెప్పారు:

విద్యుత్ పంపిణీ సంస్థ సెస్ కు ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయని, ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందని, సబ్సిడీ విద్యుత్తు సౌకర్యం ఉండదని ప్రజలు భావించారని, అందుకే బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించారని కేటీఆర్ అన్నారు. బీజేపీ సెస్ ఎన్నికల్లో గెలిచేందుకు భారీ ఎత్తున డబ్బులు జల్లిందని, సాధారణ ఎన్నికల మాదిరి విచ్చలవిడిగా అన్ని రకాల అడ్డదారులు తొక్కిందని, అనేక ప్రలోభాలకు తెరలేపినా, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వెంటే నిలిచి సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. సెస్ ఎన్నికల బీజేపీ ఓటమి, తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం బీజేపీ పట్ల నెలకొని ఉన్న తీవ్రమైన వ్యతిరేకతకు, తిరస్కారభావానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని, ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేక ఎన్నికల్లో బీజేపీని తిరస్కరిస్తూ వస్తున్నారని కేటీఆర్ అన్నారు.

సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంపైన తెలంగాణ ప్రజలకు ఉన్న అపూర్వమైన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. తమ ప్రభుత్వం రైతన్నలు, నేతన్నలు, దళిత, గిరిజనులకు, కుల వృత్తులకు అందిస్తున్న విద్యుత్ సంక్షేమ కార్యక్రమాలకు వారిచ్చిన జనామోదం అని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల విజయంతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపైన, ప్రభుత్వం పైన మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఈ గెలుపుతో ఉప్పొంగిపోకుండా సెస్ పరిధిలో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా మరియు మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలు పైన దృష్టి పెడతామని కేటీఆర్ తెలిపారు. విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమం మరియు అభివృద్ధి అనే అంశాలతో కూడిన సంతులిత విధానానికి ప్రజల నుంచి దక్కిన ఆమోదంగా భావిస్తున్నామన్నారు. ఒకవైపు రైతులు, కుల వృత్తులకు, దళిత, గిరిజనులకు రాయితీలు, ఇస్తూ మరోవైపు అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని, దీంతోపాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భారీగా మౌలిక వసతుల కల్పన, విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న తమ విధానాలను ప్రజలు బలపరిచారని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు నాయకులకు పార్టీ తరఫున కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =