ప్రముఖ బాలీవుడ్‌ సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

Bollywood Film Critic Kamaal R Khan Arrested by Mumbai Police Over Controversial 2020 Tweet, Kamal R Khan Arrested Over Controversial Tweet, Kamal R Khan Arrested By Mumbai Police, Actor Kamaal R Khan Arrested, Mango News, Mango News Telugu, Kamal R Khan Bollywood Critic, Critic Kamaal R Khan Arrested, Kamaal R Khan Latest News And Updates, KRK Arrested Over Controversial Tweet, Kamaal R Khan twitter Live Updates

బాలీవుడ్‌ సినీ విమర్శకుడిగా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ (కమల్‌ రషీద్‌ ఖాన్‌ ఉరఫ్ కేఆర్కే) అరెస్ట్ అయ్యాడు. ఈ మేరకు ఆయనను మంగళవారం ముంబై విమానాశ్రయంలో దిగిన తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ముంబైలోని బోరివలి కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కాగా రెండేళ్ల క్రితం ఒక వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్ కేసులో కేఆర్కే అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు వివాదాస్పద ట్వీట్లు కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా పలు వివాదాస్పద ట్వీట్లు విషయంలో వివిధ కేసులలో అనేక ఎఫ్ఐఆర్లను ఎదుర్కొంటున్నాడు. కాగా ఇదివరకు కేఆర్కే హిందీ బిగ్‌బాస్‌-3లో కూడా పాల్గొన్నారు.

కొన్ని హిందీ సినిమాల్లో నటించినా కమల్‌ ఆర్‌ ఖాన్‌ అంతగా గుర్తింపు తెచుకోలేకపోయాడు. అయితే తరచుగా ఇతర నటీనటులపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆయన వార్తల్లో నిలుస్తుంటారు. తనను తాను సినీ క్రిటిక్‌గా చెప్పుకునే కమల్‌ ఆర్‌ ఖాన్‌.. బాలీవుడ్ టాప్ హీరోలపై, హీరోయిన్లపై ఎప్పుడూ విమర్శలు చేస్తుంటాడు. ఇక తాజాగా 2020లో సోషల్ మీడియాలో దివంగత నటులు రిషి కపూర్ మరియు ఇర్ఫాన్ ఖాన్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కేఆర్కే పోస్ట్ చేసిన ఈ ట్వీట్లపై యువసేన కోర్ కమిటీ సభ్యుడు రాహుల్ కనాల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 4 =