బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణ భాటియా కన్నుమూత

Actor Pens Emotional Message Expressing Pain, Akshay Kumar’s Mother, Akshay Kumar’s mother Aruna Bhatia, Akshay Kumar’s mother Aruna Bhatia passes away, Akshay Kumar’s Mother Passes Away, Aruna Bhatia passes away, Bollywood Actor Akshay Kumar, Bollywood actor Akshay Kumar’s mother, Bollywood actor Akshay Kumar’s mother Passed Away, bollywood breaking news, Mango News

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా (80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడు అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన తల్లి గురించి అక్షయ్ కుమార్ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. “ఆమె నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి. మా అమ్మ మృతితో భరించలేంత నొప్పిని అనుభవిస్తున్నాను. మా అమ్మ అరుణ భాటియా ఈరోజు ఉదయం ఈ లోకాన్ని విడిచి పెట్టి, వేరే లోకంలో ఉన్న మా నాన్నతో కలిసిపోయారు. ఈ సమయంలో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు. ఓం శాంతి” అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.

ముందుగా యూకేలో సిండ్రెల్ల సినిమా షూటింగ్ లో ఉన్న అక్షయ్ కుమార్, తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో సోమవారం హుటాహుటిన ముంబయి వచ్చారు. ఆమె చివరి క్షణాల్లో ఆమెతోనే ఉన్నారు. మరోవైపు అక్షయ్ కుమార్ తల్లి మరణంపై పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్ సినీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 16 =