ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్​కలమ్ నియామకం

Brendon McCullum Appointed as England Men's Test Team Head Coach, England Men's Test Team Head Coach, Former New Zealand skipper Brendon McCullum has been appointed as the head-coach of the England's men's Test cricket team, Former New Zealand skipper, Brendon McCullum, Former New Zealand captain, Former New Zealand captain Brendon McCullum, Former New Zealand captain Brendon McCullum has been appointed as England`s men`s team head coach, England and Wales Cricket Board, ECB announced Brendon McCullum Appointed as England Men's Test Team Head Coach, Test Team Head Coach, England appoint former New Zealand captain as Test head coach, former New Zealand captain as Test head coach, Brendon McCullum was appointed As the new head coach of the England men's cricket team in Test cricket, England Team Head Coach, England Team Head Coach Latest News, England Team Head Coach Latest Updates, Mango News, Mango News Telugu,

ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను నియమిస్తునట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసీబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ పురుషుల టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెక్​కలమ్ ను నియమించినట్లు గురువారం నాడు ఈసీబీ ప్రకటించింది. వచ్చే నెలలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తో హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్​కలమ్ తన బాధ్యతలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. హెడ్ కోచ్‌ ఇంటర్వ్యూ ప్రక్రియలో తన ప్రణాళికతో మెక్​కలమ్ ఆకట్టుకున్నాడని, సభ్యులంతా అతన్ని అత్యుత్తమ అభ్యర్థిగా ఏకగ్రీవంగా అంగీకరించారని ఈసీబీ పేర్కొంది.

బ్రెండన్ మెక్​కలమ్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కోల్‌కతా నైట్ రైడర్స్ యొక్క ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అతను గతంలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుకు కూడా కోచ్‌గా ఉన్నాడు. 101 టెస్టులు ఆడిన మెక్​కలమ్, 2012 నుండి 2016లో అంతర్జాతీయ కెరీర్ కు రిటైర్మెంట్ ఇచ్చేంత వరకు న్యూజిలాండ్ జట్టుకు టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు. హెడ్ కోచ్ గా తన నియామకంపై మెక్​కలమ్ మాట్లాడుతూ, ఇంగ్లాండ్ జట్టును మరింత విజయవంతమైన యుగంలోకి తీసుకెళ్లడానికి తనకు అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. ప్రస్తుతం జట్టు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ల గురించి తనకు బాగా తెలుసనని, మరియు వాటిని ఎదుర్కొన్న తర్వాత జట్టు మరింత బలమైనశక్తిగా ఎదగడంలో సహాయపడగల తన సామర్థ్యాన్ని గట్టిగా నమ్ముతున్నానని అన్నాడు. అలాగే కెప్టెన్ బెన్ స్టోక్స్ తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని బ్రెండన్ మెక్​కలమ్ పేర్కొన్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 10 =