‘జ్ఞానవాపి మసీదు’ వివాదంపై స్పందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

AIMIM Chief Asaduddin Owaisi Responds Over Gyanvapi Mosque Verdict Says Don't Want To Lose Another Masjid, AIMIM Chief Asaduddin Owaisi Responds Over Gyanvapi Mosque Verdict, Asaduddin Owaisi Responds Over Gyanvapi Mosque Verdict, AIMIM Chief Asaduddin Owaisi Says Don't Want To Lose Another Masjid, Don't Want To Lose Another Masjid, Gyanvapi Mosque Verdict, AIMIM Chief Asaduddin Owaisi, Chief Asaduddin Owaisi, AIMIM Chief, Asaduddin Owaisi, All India Majlis-e-Ittehadul Muslimeen, All India Majlis-e-Ittehadul Muslimeen Chief Asaduddin Owaisi, Asaduddin Owaisi All India Majlis-e-Ittehadul Muslimeen Chief, Gyanvapi Mosque Verdict News, Gyanvapi Mosque Verdict Latest News, Gyanvapi Mosque Verdict Latest Updates, Gyanvapi Mosque Verdict Live Updates, Mango News, Mango News Telugu,

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ జ్ఞానవాపి మసీదు వర్సెస్ శృంగార్ గౌరీ కేసులో వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు. తీర్పు నిరాశను కలిగించిందని, ఇప్పటికే ఎన్నో పోగొట్టుకున్నామని, ఇప్పుడు మరో మసీదును పోగొట్టుకోవాలని కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. తాజా కోర్టు ఆదేశం, 1991 నాటి ప్రార్ధనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఒవైసీ అన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళతాయని నేను భావిస్తున్నానని పేర్కొన్నారు. మతపరమైన ప్రదేశాల స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నించే ఎవరినైనా ఉపేక్షించకూడదని 1991 చట్టం స్పష్టంగా చెబుతోంది. కాబట్టి యోగి ప్రభుత్వం ఈ వ్యక్తులపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. కోర్టులు వారిని దోషులుగా గుర్తిస్తే, వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

కేసు పూర్వాపరాల ప్రకారం.. 2021లో మసీదు గోడ వద్ద ఉన్న గౌరి, గణేశ్, హనుమాన్, నంది విగ్రహాలకు రోజూ పూజలు చేసుకునేందుకు అనుమతించాలని, వీటిని ధ్వంసం చేయకుండా అడ్డుకోవాలని కొందరు స్థానిక కోర్టునాశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు వీడియో సర్వేకు ఆదేశాలిచ్చింది. ఈ తీర్పుపై మసీదు కమిటీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు మే 6న వీడియో సర్వే ప్రారంభించారు. కోర్టు కమిషనర్ అజయ్ మిశ్రాను తొలగించేందుకు నిరాకరించిన కోర్టు కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞాన్వాపి మసీదులో వీడియో పరిశీలన కొనసాగుతుందని ఆదేశించింది. జ్ఞానవాపి మసీదులో సర్వే, వీడియోగ్రఫీని నిర్వహించేందుకు నియమించిన అడ్వొకేట్‌ కమిషనర్‌ను తొలగించాలన్న విజ్ఞప్తిని స్థానిక కోర్టు తోసిపుచ్చింది. జ్ఞానవాపి– శృంగార్ గౌరీ కాంప్లెక్స్‌లో సర్వేను పది రోజుల్లో ముగించాలని ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =