రాష్ట్రాలకు రూ.17,000 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల, ఏపీకి రూ.682 కోట్లు, తెలంగాణకు రూ.542 కోట్లు

Centre Releases Rs 17000 Cr of GST Compensation to States and UTs,Rs.17000 Cr GST Compensation Released To States, GST Compensation Rs.682 Crore To AP, GST Compensation Rs.542 Crore To Telangana,Mango News,Mango News Telugu,GST Compensation,GST Compensation For States, GST Compensation Latest News and Updates,GST Compensation Live Updates,Goods and Service Tax Compensation,Goods and Service Tax

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు మరోసారి జీఎస్టీ పరిహారం కింద నిధులు విడుదల చేసింది. 2022 ఏప్రిల్ నుండి జూన్ వరకు బ్యాలన్స్ జీఎస్టీటి పరిహారం కింద నవంబర్ 25, శుక్రవారం నాడు 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.17,000 కోట్లు విడుదల చేసింది. ఈ రూ.17,000 కోట్ల మొత్తంతో సహా 2022-23 సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం విడుదల చేసిన మొత్తం జీఎస్టీ పరిహారం రూ.1,15,662 కోట్లు అని పేర్కొన్నారు. 2022, అక్టోబరు వరకు మొత్తం సెస్సు వసూళ్లు రూ.72,147 కోట్లు మాత్రమేనని, మిగిలిన రూ.43,515 కోట్లను కేంద్రం తన సొంత వనరుల నుంచి విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్రాలు తమ ఆర్ధిక వనరుల నిర్వహణ పాటుగా ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం నిర్వహణ, ఇతర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో సహాయపడటానికి ఈ నిర్ణయం తీసుకోబడిందని తెలిపారు.

ఈ జీఎస్టీ పరిహారం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.682 కోట్లు విడుదల కాగా, తెలంగాణ రాష్ట్రానికి రూ.542 కోట్లు విడుదల అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.2,081 కోట్లు, ఆతర్వాత ఉత్తర్ ప్రదేశ్ కు రూ.1,202 కోట్లు, ఢిల్లీకి రూ.1,200 కోట్లు, కర్ణాటకకు రూ.1,915 కోట్లు, తమిళనాడుకు రూ.1,188 కోట్లు విడుదల అయ్యాయి. మరోవైపు ఈ ఏడాది మేలో కూడా కేంద్ర ప్రభుత్వం 2022, ఫిబ్రవరి-మే కాలానికి రాష్ట్రాలకు తాత్కాలిక జీఎస్టీ పరిహారంగా రూ.86,912 కోట్లు విడుదల చేసింది. అప్పటికి జీఎస్టీ పరిహార నిధిలో రూ.25,000 కోట్లు మాత్రమే ఉన్నప్పటికీ, కేంద్రం సొంత వనరుల నుంచి రూ.62,000 కోట్లు విడుదల చేసింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =