పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో.. 9 ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశం, ప్రయోగం సక్సెస్

ISRO Launches PSLV-C54 Rocket with Nine Satellites into Space Today From Sriharikota,ISRO Key Launch Tomorrow,PSLV C54 Luanch, PSLV C54 Countdown Begins,Mango News,Mango News Telugu,PSLV C54 Satellite,PSLV C54 Rocket Launch,PSLV C54 Sriharikota,Sriharikota Rocket Launch,Sriharikota Latest News and Updates,PSLV C54 Countdown,ISRO PSLV C54 Rocket,ISRO PSLV C54 Rocket Launch News and Updates

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతమైంది. శనివారం తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ54 ఉపగ్రహం అంతరిక్షంలోకి పంపబడింది. దీనికోసం ఇస్రో శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించగా.. ఈరోజు ఉదయం 11.56 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నిమిషాల వ్యవధిలోనే ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరిందని, ప్రయోగం సక్సెస్ అయిందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రకటించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి పీఎస్‌ఎల్వీ సీ54 ఉపగ్రహ వాహక నౌకను నిర్దేశిత కక్ష్య లోకి ప్రవేశించేలా చేయగలిగామని, తద్వారా 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపామని ఆయన తెలిపారు. ఇక పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సిరీస్‌లో ఇది 56వ ప్రయోగమని, అలాగే ఈ ఏడాదిలో ఇదే చివరి ప్రయోగమని కూడా సోమనాథ్ తెలిపారు. ఇక వీటిద్వారా భూ వాతావరణ పరిశీలన, తుఫానుల రాకను ముందుగా పసిగట్టడం, మీథేన్ లీకులు, భూగర్భ చమురు, వ్యవసాయ సంబంధిత మార్పులు తదితర విషయాలను శాస్త్రవేత్తలు గుర్తించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =