రాష్ట్రాల వద్ద అందుబాటులో కోటి 60 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు : కేంద్రం

Centre Says More Than 1.60 Crore Covid Vaccine Doses are Still Available with the States/UTs,More Than 1.60 Crore Covid Vaccine Doses Still Available,Over 1.6 Crore Covid Vaccine Doses Still Available With States,Covid-19,More Than 1.60 Crore Vaccine Doses Available,Covid-19 Vaccine,Centre Says Covishield Wastage Down,Covishield,Covid-19 Vaccination,Covid Vaccination,Covid Vaccine,Covid Vaccination In India,Covid-19 Vaccine India,Covid-19 Vaccination New,Vaccination In India Latest Updates,1.60 Crore Covid-19 Vaccine Doses Available With States,Covid-19 In India,More Than 1.60 Crore Vaccine Doses Available,Covid Vaccine Doses

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులు, త్వరలో అందించబోయే డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉచిత కేటగిరీ ద్వారా మరియు నేరుగా రాష్ట్రాల సేకరణ కేటగిరీ ద్వారా మొత్తం 21 కోట్లకుపైగా (21,33,74,720) కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు. ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి మే 21, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 19,73,61,311 డోసులను వినియోగించినట్టు ప్రకటించారు.

ఇక అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ఈ రోజు ఉదయం 8 గంటల వరకు 1.60 కోట్లకుపైగా (1,60,13,409) కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. అలాగే రాబోయే 3 రోజుల్లో మరో దాదాపు 2.67 లక్షల (2,67,110) వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − one =