కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022: వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు స్వర్ణం, బింద్యారాణికి రజతం

Commonwealth Games-2022 Mirabai Chanu Clinches Gold Bindyarani Wins Silver Medals For India in Weightlifting, Mirabai Chanu Clinches Gold Bindyarani Wins Silver Medals For India in Weightlifting, Commonwealth Games-2022 Bindyarani Wins Silver Medal For India in Weightlifting, Commonwealth Games-2022 Mirabai Chanu Clinches Gold Medal For India in Weightlifting, Gold And Silver Medals in Weightlifting, Weightlifters Mirabai Chanu and Bindyarani, Weightlifter Bindyarani, Weightlifter Mirabai Chanu, Weightlifting, Gold And Silver Medals in Commonwealth Games-2022, Commonwealth Games-2022, Birmingham Commonwealth Games 2022, 2022 Birmingham Commonwealth Games, Birmingham Commonwealth Games, Commonwealth Games, Birmingham Alexander Stadium, Commonwealth Games 2022 sports, Birmingham Commonwealth Games 2022 News, Birmingham Commonwealth Games 2022 Latest News, Birmingham Commonwealth Games 2022 Latest Updates, Birmingham Commonwealth Games 2022 Live Updates, Mango News, Mango News Telugu,

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్‌లో రెండో రోజు భారత్ సత్తా చాటింది. మొత్తం నాలుగు పతకాలు సాధించింది. ఈ క్రమంలో దేశానికి తొలి బంగారు పతకం దక్కింది. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుత ప్రదర్శనతో స్వర్ణం చేజిక్కించుకుంది. ఇక మరో వెయిట్ లిఫ్టర్ బింద్యారాణి రజతం పతకంతో మెరిసింది. మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడిన 27 ఏళ్ల మీరాబాయి మొత్తం 201 కేజీలు లిఫ్ట్ చేసి రికార్డు సృష్టించింది. స్నాచ్ విభాగంలో 88 కేజీలు ఎత్తిన చాను, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 113 కేజీలు లిఫ్ట్ చేసింది. కాగా 2018 కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం అందించింది కూడా మీరాబాయి చానునే కావడం విశేషం.

ఇక మరో వైపు మహిళల 55 కిలోల విభాగంలో పోటీపడిన బింద్యారాణి రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ సాధించింది. క్లీన్‌ అండ్‌ జర్క్‌ రెండో ప్రయత్నంలో 114 కిలోలు ఎత్తడంలో విఫల మవడంతో ఆమెకు ఇక కాంస్యమే అని అందరూ భావించారు. కానీ, చివరి రౌండ్‌లో ముఖ్యంగా పుంజుకున్న పుంజుకున్న బింద్యారాణి 116 కిలోలు ఎత్తి రజతం సొంతం చేసుకుంది. కాగా ఇప్పటివరకు భారత్ సాధించిన నాలుగు పతకాలు వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలోనే రావడం విశేషం. రెండోరోజు ఆరంభంలో వెయిట్‌ లిఫ్టింగ్‌లో 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సర్గర్ రజతం సాధించగా, 61 కేజీల విభాగంలో గురురాజా పూజారి కాంస్య పతకం గెలిచారు.

కాగా కామన్‌వెల్త్ గేమ్స్‌-2022లో వెయిట్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన మీరాబాయి చాను, రజతం దక్కించుకున్న బింద్యారాణిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, మాజీ క్రికెటర్ ఎంపి గౌతమ్ గంభీర్ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. మీరాబాయిని ఉద్దేశించి ప్రధాని మోదీ ట్విట్టర్ లో అభినందనలు తెలుపుతూ.. మీరాబాయి భారతదేశం మరోసారి గర్వపడేలా చేసింది! బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో ఆమె స్వర్ణం గెలిచి కొత్త కామన్వెల్త్ రికార్డును నెలకొల్పినందుకు ప్రతి భారతీయుడు సంతోషిస్తున్నాడు. ఆమె విజయం చాలా మంది భారతీయులకు, ముఖ్యంగా వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది” అని ప్రధాని ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 4 =