దేశంలో 4,767 యాక్టీవ్ కరోనా కేసులు, కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?

Corona in India: 291 Fresh Positive Cases 377 Recoveries Reported in Last 24 Hours,377 Covid Recoveries,Covid Last 24 Hours, 291 People Tested Positive,Coronavirus In India,Mango News,Mango News Telugu,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలో గత 24 గంటల్లో 300 లోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 291 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 1, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,72,638 కు చేరుకుంది. కాగా కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,622గా ఉంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు కొంత ఎక్కువగా నమోదయ్యాయి.

దేశంలో 4,767 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.80 శాతం:

దేశంలో ప్రస్తుతం 4,767 (0.01%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 377 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,37,249 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక నవంబర్ 30న 2,14,021 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.14 శాతంగా నమోదైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =