బీఎస్ఎఫ్ 58వ రైజింగ్ డే: బీఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

PM Modi Greets BSF Personnel and their Families on the Occasion of 58th BSF's Raising Day,BSF 58th Rising Day,PM Modi Wishes BSF Personnel,PM Modi Wishes BSF Families,Mango News,Mango News Telugu,58th BSF's Raising Day,BSF's Raising Day,BSF Raising Day,BSF Personnel,BSF Latest News and Updates,Border Security Force,Border Security Force News and Live Updates,BSF News and Updates,BSF Personnel

సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) 58వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా బీఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని రక్షించడంలో మరియు అత్యంత శ్రద్ధతో దేశానికి సేవ చేస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు అత్యుత్తమ ట్రాక్ రికార్డ్‌ ఉందన్నారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. “బీఎస్ఎఫ్ సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ రైజింగ్ డే శుభాకాంక్షలు. బీఎస్ఎఫ్ భారతదేశాన్ని రక్షించడంలో మరియు మన దేశానికి అత్యంత శ్రద్ధతో సేవ చేయడంలో అత్యుత్తమ ట్రాక్ రికార్డ్ కలిగిన శక్తి. ప్రకృతి వైపరీత్యాల వంటి సవాళ్లతో కూడిన పరిస్థితులలో బీఎస్ఎఫ్ యొక్క గొప్ప పనిని కూడా నేను అభినందిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ, ” బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హీరోలందరికీ 58వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ సరిహద్దులను అభేద్యంగా ఉంచుతూ, అనేక ప్రతికూల పరిస్థితులలో తమ శౌర్యం మరియు పరాక్రమంతో దేశాన్ని రక్షిస్తున్నారు. మన బీఎస్ఎఫ్ సిబ్బంది శౌర్యం మరియు విధినిర్వహణ ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేస్తుంది మరియు స్ఫూర్తినిస్తుంది” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here