దేశంలో గత 24 గంటల్లో 91 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేట్ ఎంతంటే?

Corona in India: 91 New Positive Cases Reported and Active Cases Down to 1817,Covid Deaths,Covid Last 24 Hours, 91 People Tested Positive,Coronavirus In India,Mango News,Mango News Telugu,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 91 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 6, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,83,454 కు చేరుకుంది. మరోవైపు కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 530745 గా ఉంది. ఇక ఫిబ్రవరి 5న 62,790 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.14 శాతంగా నమోదైంది.

దేశంలో 1,817 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.81 శాతం:

దేశంలో ప్రస్తుతం 1,817 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 91 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,50,892 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ (37), కర్ణాటక (15), మహారాష్ట్ర (12), తమిళనాడు (6), వెస్ట్ బెంగాల్ (4) వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. కాగా దేశంలోని 23 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదుకాలేదు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 10 =