పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్‌.. తీవ్ర అభ్యంతరం తెలిపిన బీజేపీ

Congress MP Shashi Tharoor's Post Amid Backlash Over His Tweet on Former Pakistan President Pervez Musharraf,Congress MP Shashi Tharoor,Tweet on Former Pakistan President Musharraf,Former Pakistan President Musharraf,Mango News,Mango News Telugu,National Politics News,National Politics And International Politics,National Politics Article,National Politics In India,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics,Shri Narendra Modi Politics,Narendra Modi Political Views,President Of India,Indian Prime Minister Election

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. థరూర్ చేసిన ట్వీట్‌పై అధికార బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. మన సైనికుల మరణానికి కారణమైన శత్రుదేశ వ్యక్తిని ప్రశంసించి కాంగ్రెస్ ఎంపీ తప్పు చేశారని మండిపడింది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ థరూర్ వ్యాఖ్యలను ఖండించారు. అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకుడు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం మరియు అమాయక ప్రజలకు హాని కలిగించడం వంటి ఎన్నో తీవ్ర చర్యలను ప్రేరేపించిన వ్యక్తిగా ప్రపంచం ముషారఫ్‌ను గుర్తు పెట్టుకుంటుంది. అలాంటి యుద్ధోన్మాదిని శాంతి కాముకుడు అంటూ ప్రవచించడం కాంగ్రెస్ నేతలకే చెల్లింది అని చంద్రశేఖర్ విమర్శించారు.

ఇక బిజెపి నాయకుల విమర్శలకు ప్రతిస్పందనగా, శశి థరూర్ మరో ట్వీట్ చేశారు. అందులో.. ‘నేను భారతదేశంలో పెరిగాను, అక్కడ ఎవరైనా ఓకే వ్యక్తి చనిపోయినప్పుడు ప్రజలు వారి గురించి మంచి మాటలు మాట్లాడతారు. అదే భావనతో నేను స్పందించాను. పర్వేజ్ ముషారఫ్ దేశభక్తి గల భారతీయులందరికీ అసహ్యం కలిగిస్తే, బిజెపి ప్రభుత్వం 2003లో అతనితో కాల్పుల విరమణపై చర్చలు జరిపి, 2004లో వాజ్‌పేయి-ముషారఫ్ ఉమ్మడి ప్రకటనపై ఎందుకు సంతకం చేసింది? అప్పుడు అతను విశ్వసనీయమైన శాంతి భాగస్వామిగా కనిపించలేదా?’ అని బీజేపీ నేతలను థరూర్ ప్రశ్నించారు.

కాగా అంతకుముందు రోజు చేసిన ట్వీట్‌లో శశి థరూర్.. ‘ముషారఫ్ నిష్కళంకమైన శత్రువు మరియు కార్గిల్‌ యుద్దానికి కారణమయ్యాడు అనడంలో నాకెలాంటి సందేహం లేదు. అతను మన దేశానికి మిత్రుడు కాదు, అయితే ఆ తర్వాత అతను తన స్వంత ప్రయోజనాల కోసమైనా 2002-2007 కాలంలో ఇరు దేశాల మధ్య శాంతిని బలంగా కోరుకున్నాడు’ అని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కాగా దేశ బహిష్కరణను ఎదుర్కొంటున్న ముషారఫ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం దుబాయ్‌లో మరణించారు. ఆయన వయసు 79 సంవత్సరాలు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + seven =