దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. వరుసగా మూడో రోజూ 10 వేలకు పైనే కొత్త కేసులు నమోదు

Corona Updates India Reports 10753 New Covid-19 Cases in Last 24 Hours,Corona Updates,India Reports 10753 New Covid-19 Cases,Covid-19 Cases in Last 24 Hours,Mango News,Mango News Telugu,India Reports 10753 New Covid Cases,Covid News Live Updates,Coronavirus in India Live Updates,India Records 10753 Fresh Covid Cases,Indias Active COVID-19 Cases Exceed,Corona India,Information About COVID-19,India Covid Last 24 Hours Report,Active Corona Cases,Corona Active Cases Exceeds,MoHFW,India Fights Corona

భారతదేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదలతో ఆందోళన కలిగిస్తోంది. గత పది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కోవిడ్‌ కేసులు శనివారం కూడా భారీగా నమోదయ్యాయి. శుక్రవారం 11 వేలకు పైనే కొత్త కేసులు నమోదవగా.. ఈరోజు 10వేలకు పైగా వెలుగుచూశాయి. దీంతో వరుసగా మూడోరోజూ 10వేలకు పైనే కేసులు నమోదయ్యాయి. ఇక కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు) మొత్తం 1,58,625 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 10,753 కొత్త కోవిడ్-19 పాజిటివ్‌లు వెలుగుచూశాయి. తద్వారా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేల మార్కును దాటింది. అలాగే మొత్తం కేసుల సంఖ్య 4,48,08,022కి చేరినట్లయింది. అలాగే 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి 27 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,31,091కి చేరుకుంది.

దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఏప్రిల్ 15, ఉదయం 8 గంటల వరకు):

  • గత 24 గంటల్లో నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,58,625
  • కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 14–ఏప్రిల్ 15 (8AM-8AM)] : 10,753
  • మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,48,08,022
  • కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 6,628
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,42,23,211
  • కరోనా రికవరీ రేటు : 98.69 శాతం
  • యాక్టివ్ కేసులు : 53,720
  • కొత్తగా నమోదైన మరణాలు : 27
  • మొత్తం మరణాల సంఖ్య : 5,31,091
  • మొత్తం కరోనా వ్యాక్సిన్‌ డోసులు: 220.66 (220,66,25,517) కోట్లు పంపిణీ.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =