దేశంలో మంగళవారం ఉదయానికి 20,23,809 మందికి కరోనా వ్యాక్సిన్

Corona Vaccination, Corona Vaccination Drive, Corona Vaccination in India, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India Corona Vaccination, Indian Government, Mango News, Vaccine Distribution

దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. జనవరి 26, మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 20,23,809 మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో మొత్తం 7,764 కేంద్రాల్లో 4,08,305 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 36,378 సెషన్లు నిర్వహించినట్టు తెలిపారు. ఇప్పటివరకు అత్యధికంగా కర్ణాటకలో(2,31,172), ఒడిశాలో (1,77,090), రాజస్థాన్ లో (1,61,116), ఆంధ్రప్రదేశ్ లో (1,56,120), మహారాష్ట్రలో (1,36,901), తెలంగాణలో (1,30,390), ఉత్తరప్రదేశ్ లో (1,23,761), వెస్ట్ బెంగాల్ లో (1,22,851) లబ్దిదారులకు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్రం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =