మందు ప్రియులకు గుడ్ న్యూస్, తెలంగాణలో కొత్తగా 159 బార్లు

Mango News, Pubs and bars in Telangana, Telangana Bars, telangana government, Telangana Govt, Telangana Govt Permits to Setup 159 New Bars, Telangana invites applications for setting up new bars, Telangana new bars News, Telangana News Bars, Telangana setting up new bars, Telangana State Beverages Corporation, Telangana State Beverages Corporation Ltd

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త బార్లు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 159 కొత్త బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కొత్తబార్ల ఏర్పాటు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్ సోమవారం నాడు‌ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 55, రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో 104 బార్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. బార్ల ఏర్పాటుకు ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. దరఖాస్తు ఫీజు కింద రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే బార్ లైసెన్సు ఫీజులు కూడా నిర్ణయించారు. స్లాబ్ 1 కింద 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్సు ఫీజు రూ.30 లక్షలుగా, స్లాబ్ 2 కింద 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.42 లక్షలు, స్లాబ్ 3 కింద 5 లక్షల నుంచి 20 లక్షల వరకు జనాభా ఉంటే రూ.44 లక్షలు, స్లాబ్ 4 కింద 20 లక్షలకు పైగా జనాభా ఉంటే లైసెన్సు ఫీజును రూ.49 లక్షలుగా నిర్ణయించారు. లాటరీ విధానంద్వారా త్వరలో ఈ బార్ల కేటాయింపు చేపట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + six =