దేశంలో ఒక్కరోజే 11502 కరోనా కేసులు, 325 మరణాలు నమోదు

Covid-19 in India, Coronavirus Cases In India, Coronavirus Deaths In India, Coronavirus Higlights, Coronavirus In India, Coronavirus in India live updates, Coronavirus Live Updates, Coronavirus news highlights, Coronavirus outbreak, coronavirus positive cases, Coronavirus Positive Cases In India, india coronavirus cases, india coronavirus deaths,Total Corona Cases In India

భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో దేశంలో ప్రతి రోజు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 11,502 కరోనా పాజిటివ్ కేసులు, 325 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూన్ 15, సోమవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,32,424 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ 4వ స్థానంలో నిలిచింది.

అలాగే కొత్తగా నమోదైన 325 మరణాలతో కలిపి కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 9,520 కి చేరింది. ప్రపంచంలో కరోనా మరణాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది. మొత్తం కరోనా బాధితుల్లో 1,69,798 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 1,53,106 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో భారత్ లో అత్యధిక కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది. కాగా దేశంలో చికిత్స తీసుకుంటున్న కరోనా బాధితుల సంఖ్య కంటే వైరస్ లక్షణాలు‌ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం కొంచెం ఊరట కలిగిస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =