అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఏపీ గ్రీన్ సిగ్నల్, ముందుగా కర్ణాటకకు…

Andhra Pradesh, Andhra Pradesh News, AP Government, AP Govt Appeals to Give Permit for Interstate Bus Services, AP Govt to Resume Interstate Bus Services, AP Interstate Bus Services, AP RTC Services, Interstate Bus Services, interstate bus services in ap, RTC and Interstate bus Services

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగా ఏపీ నుంచి కర్ణాటకకు బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా తొలుత పరిమిత సంఖ్యలో బస్సులు నడపనున్నారు. ముందుగా 168 బస్సులను జూన్ 17 నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సహా పలు ప్రాంతాలకు నడపాలని ఏపీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. అనంతరం నాలుగు దశల్లో బస్సుల సంఖ్యను 500 కు పెంచనున్నారు. ఏపీలోని పలు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు బస్సులు నడిపేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది.

ఇక జూన్ 15, సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో ఈ సర్వీసులకు రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనల్లో భాగంగా బస్సుల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజర్‌ వాడకం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అలాగే కర్ణాటక నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేసేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చ్ నెల చివరి నుంచి లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో ఆగిపోయిన అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎట్టకేలకు ప్రారంభం కాబోతున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − six =