దేశంలో కొత్తగా 2075 మందికి కరోనా పాజిటివ్, 71 మరణాలు నమోదు

Covid-19 in India 2075 New Positive Cases 71 Deaths Reported in Last 24 Hours, India, 2075 New Covid-19 Positive Cases, 71 Deaths Reported, 2075 Positive Cases, India Covid-19, 71 Deaths Reported on March 18th, 2075 New Covid-19 Positive Cases and 71 Deaths Reported In India, 2075 New Covid-19 Cases 71 Deaths in Last 24 Hours In India, Covid-19 Updates of India 2075 Positive Cases 71 Deaths Reported on March 18th, India Covid-19 Updates 2075 Positive Cases 71 Deaths Reported on March 18th, 2075 new Covid-19 cases, 2075 new Covid-19 cases In India, 71 Deaths In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 2075 Positive Cases, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates,

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసులు 3 వేల దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,075 పాజిటివ్ కేసులు, 71 మరణాలు నమోదయ్యాయి. దీంతో మార్చి 19, శనివారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,30,06,080 కు, మరణాల సంఖ్య 5,16,352 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 0.56 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 0.41 శాతంగా ఉంది.

అలాగే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల వ్యవధిలో 3,383 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,24,61,926 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.73 శాతం గానూ, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 27,802 (0.06%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 3,70,514 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 78.22 కోట్ల (78,22,28,685) కు చేరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 5 =