ఒకేరోజులో కరోనాతో 308 మంది మృతి, మరో 11416 పాజిటివ్ కేసులు నమోదు

Corona Positive Cases in Maharashtra, Corona Positive Cases In Maharashtra, Maharashtra, Maharashtra , Maharashtra Corona, Maharashtra Corona Cases, Maharashtra Corona Deaths, Maharashtra Corona Positive Cases, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Positive Cases, Maharashtra Coronavirus Updates, Maharashtra COVID 19

దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎక్కువుగా ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 15 లక్షలు దాటింది. అక్టోబర్ 10, శనివారం నాడు కూడా 11416 కరోనా కేసులు, 308 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,17,434 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 40,040 కి పెరిగింది.

ఇక కొత్తగా కోవిడ్ నుంచి 26,440 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 12,55,779 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 82.76 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.64 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2,21,156 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు శనివారం నాటికీ మహారాష్ట్రలో 75,69,447 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 8 =