దేశంలో 200 కోట్ల మైలురాయి దాటిన కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు పంపిణీ, ప్రధాని మోదీ ప్రశంసలు

Covid-19 Vaccination in India Cumulative Coverage Exceeds Landmark of 200 Cr Doses PM Modi Appreciates, Cumulative Coverage Exceeds Landmark of 200 Cr Doses PM Modi Appreciates, Cumulative Coverage Exceeds Landmark of 200 Cr Doses, PM Modi Appreciates, Covid Vaccination in India, Wuhan Virus Vaccination, Wuhan Virus, India COVID-19 Vaccination, Corona Vaccination Programme, Corona Vaccine, Coronavirus, coronavirus vaccine, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination, Covid-19 Vaccination Distribution, COVID-19 Vaccination Dose, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Mango News, Mango News Telugu,

దేశంలో కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200 కోట్లు దాటింది. జూలై 17, ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో 200 కోట్ల మైలురాయిని అధిగమించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇక జూలై 18, సోమవారం ఉదయం 7 గంటల వరకు ప్రజలకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,00,04,61,095 కు చేరుకుంది. ఇప్పటికి మొత్తం 2,63,34,227 సెషన్ల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.

సైన్స్‌పై విశేషమైన విశ్వాసాన్ని కనబరుస్తున్నందుకు మరియు 200 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల మైలురాయిని దాటినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ప్రశంసించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “భారత్ మళ్లీ చరిత్ర సృష్టిచింది. 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల ప్రత్యేక సంఖ్యను దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. భారతదేశం యొక్క వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను స్కేల్ మరియు వేగంలో అసమానంగా మార్చడానికి సహకరించిన వారి పట్ల గర్వంగా ఉంది. ఇది కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసింది. వ్యాక్సిన్‌ను విడుదల చేసిన సమయంలో దేశ ప్రజలు సైన్స్‌పై విశేషమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు. మన వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకులు సురక్షితమైన ప్రపంచాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించారు. వారి స్పిరిట్ మరియు సంకల్పాన్ని నేను అభినందిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వివరాలు (జూలై 18, ఉదయం 7 గంటల వరకు):

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,04,10,336
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 1,00,79,797
  • హెల్త్ కేర్ వర్కర్స్ (ప్రికాషన్ డోసు) : 60,24,487
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,84,27,577
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 1,76,52,344
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (ప్రికాషన్ డోసు) : 1,14,69,971
  • 12-14 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 3,79,98,722
  • 12-14 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 2,62,25,897
  • 15-18 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 6,08,48,302
  • 15-18 ఏళ్ల వయసు వారు (రెండో డోసు) : 5,01,31,500
  • 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 55,88,99,360
  • 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు) : 50,59,28,479
  • 18-44 ఏళ్ల వయసు వారు (ప్రికాషన్ డోసు) : 64,24,565
  • 45-59 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 20,35,69,720
  • 45-59 ఏళ్ల వయసు వారు (రెండో డోసు) : 19,45,74,456
  • 45-59 ఏళ్ల వయసు వారు (ప్రికాషన్ డోసు) : 46,43,182
  • 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 12,73,61,591
  • 60 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు) : 12,15,80,188
  • 60 ఏళ్లు పైబడినవారు (ప్రికాషన్ డోసు) : 2,82,10,621
  • మొత్తం ప్రికాషన్ డోసుల పంపిణీ : 5,67,72,826
  • పంపిణీ చేసిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 2,00,04,61,095

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =