ఏపీలో కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నిక.. ఓటు వేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు

AP Ex CM Chandrababu Naidu and other TDP MLAs Cast their Votes in Presidential Election, TDP MLAs Cast their Votes in Presidential Election, AP Ex CM Chandrababu Naidu Cast their Vote in Presidential Election, AP Ex CM Chandrababu Naidu, AP Former CM Chandrababu Naidu, Nara Chandrababu Naidu, Presidential Elections-2022 Polling, India To Elect 15th President Of India On July 18, 15th President Of India, India To Elect 15th President Of India, elections for the 15th President of India are scheduled on the 18th of July, NDA candidate Draupadi Murmu, UPA candidate Yashwant Sinha, United Progressive Alliance, National Democratic Alliance, next President of India post, Presidential elections 2022, 2022 Presidential elections, Presidential elections, Presidential elections News, Presidential elections Latest News, Presidential elections Latest Updates, Presidential elections Live Updates, Mango News, Mango News Telugu,

దేశవ్యాప్తంగా సోమవారం రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్-1లో పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే తన మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

అయితే పోలింగ్ ప్రారంభమైన తర్వాత ముందుగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినిగించుకున్నారు. కాగా ఏపీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అత్యధికంగా అధికార వైసీపీకి 151 మంది ఉన్నారు. ఆ తరువాత టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు, జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అలాగే రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంట్‌ స్థానాలుండగా.. వైసీపీకి 22 మంది, టీడీపీ ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఇక రాజ్యసభ స్థానాలు 11 ఉండగా వైసీపీ ఎంపీలు 9 మంది, టీడీపీ, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా దాదాపు 4,800 మంది ఎన్నికైన ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు సోమవారం భారత 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఓటు వేస్తున్నారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు పోటీగా ప్రతిపక్షాల తరపున యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. అయితే ముర్మూకు అనుకూలంగా దాదాపు 60 శాతానికి పైగా ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 4 =