దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 57వ రోజైన మార్చి 13, శనివారం నాడు ఒక్కరోజే 15 లక్షలకుపైగా (20,19,723) కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అలాగే ఆదివారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య దాదాపుగా 3 కోట్లు ( 2,97,38,409) చేరుకున్నట్టు పేర్కొన్నారు.
దేశంలో మార్చి 13న జరిగిన కరోనా వ్యాక్సినేషన్ వివరాలు (15,19,952):
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 54,320
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 1,01,171
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 96,896
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 1,86,650
- 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 8,95,291
- కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు): 1,85,624
- మార్చి 13న లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 15,19,952
దేశంలో మార్చి 14 వరకు జరిగిన మొత్తం కరోనా వ్యాక్సినేషన్ వివరాలు(7 AM వరకు – 2,97,38,409):
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 73,47,895
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 42,95,201
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 73,32,641
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 11,35,573
- 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 81,87,007
- కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు): 14,40,092
- మొత్తం లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 2,97,38,409
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ