దేశంలో 50% కంటే ఎక్కువమంది 15-18 ఏళ్ల యువకులకు మొదటి డోసు వ్యాక్సిన్, పీఎం మోదీ ప్రశంసలు

Covid-19 Vaccination, Covid-19 Vaccination for Children of 15-18 Years, COVID-19 Vaccination in India, Guidelines for COVID-19 vaccination of children, Health Min says over 50% of youngsters aged 15-18 have received 1st COVID vaccine jab, Health Min says over 50% of youngsters aged 15-18 have Vaccined, Mango News, Over 50 pc children in 15-18 age group receive 1st dose of COVID vaccine, Over 50 Percent of 15-18 Age Group Received 1st Dose, vaccination drive for 15-18 age group

దేశంలో జనవరి 3వ తేదీ నుంచి 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్లకు కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. 15-18 సంవత్సరాల వయసు వారికీ హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కోవాక్జిన్” కోవిడ్ వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేటగిరి కింద ఇప్పటివరకు 50% కంటే ఎక్కువ మందికి (3,73,04,693) మొదటి వ్యాక్సిన్ వేసినట్టు మంగళవారం నాడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కరోనాకు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి ఇది మరో పెద్ద రోజని, 15-18 ఏళ్ల మధ్య ఉన్న యువకులలో 50% కంటే ఎక్కువ మంది కోవిడ్ వ్యాక్సిన్ యొక్క మొదటి డోసు తీసుకున్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ పట్ల యువకుల ఉత్సాహం భారతదేశం అంతటా ప్రజలకు స్ఫూర్తినిస్తోందని తెలిపారు.

మరోవైపు దేశంలో 50% కంటే ఎక్కువ మంది 15-18 సంవత్సరాల వయసువారు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. యువ భారతదేశం మార్గం చూపుతోందని, ఇది ప్రోత్సాహకరమైన వార్తని, మనం ఊపందుకుంటున్నామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయడం మరియు అన్ని కరోనా సంబంధిత ప్రోటోకాల్‌లను పాటించడం చాలా ముఖ్యమని, కలిసికట్టుగా ఈ మహమ్మారిపై పోరాడదామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇక జనవరి 19, బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 158.88 కోట్లు (1,58,88,47,554) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే 76 లక్షల మందికిపైగా (76,35,229) వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 7 =